వెర్మిసెల్లీ బర్ఫీ
ABN , First Publish Date - 2020-07-04T18:52:10+05:30 IST
సేమ్యా - 50గ్రాములు, పంచదార - అరకప్పు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూన్, జీడిపప్పు - ఐదారు పలుకులు.
కావలసినవి: సేమ్యా - 50గ్రాములు, పంచదార - అరకప్పు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూన్, జీడిపప్పు - ఐదారు పలుకులు.
తయారీ: ఒక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి సేమ్యా, జీడిపప్పును గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. మరొక పాత్రలో నీళ్లు తీసుకుని మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో పంచదార వేయాలి. పంచదార కరిగాక వేగించి పెట్టుకున్న సేమ్యా వేయాలి. యాలకుల పొడి వేసి నెమ్మదిగా కలుపుతూ మరగనివ్వాలి. తరువాత కొద్దిగా నెయ్యి వేయాలి. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని నెయ్యి రాయాలి. అందులో సేమ్యా మిశ్రమం పోయాలి. చల్లారిన తరువాత చతురస్రాకారం షేప్‌లో కట్ చేయాలి. జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.