సేమ్యా ఉప్మా

ABN , First Publish Date - 2020-07-04T18:24:15+05:30 IST

సేమ్యా - ఒక కప్పు, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, అల్లం - చిన్నముక్క, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ -

సేమ్యా ఉప్మా

కావలసినవి: సేమ్యా - ఒక కప్పు, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, అల్లం - చిన్నముక్క, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, పసుపు - అర టీస్పూన్‌, పచ్చిబఠాణీ - రెండు టేబుల్‌స్పూన్లు, వేరుసెనగలు - కొన్ని, క్యాప్సికం - రెండు టేబుల్‌స్పూన్లు, బీన్స్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మకాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట. ఉప్పు - రుచికి తగినంత.


తయారీ: ముందుగా పాన్‌లో నూనె వేసి సేమ్యాను గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. ఇప్పుడు మరో పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో సేమ్యా వేయాలి. కొద్దిగా ఉప్పు వేసి సేమ్యా మెత్తగా అయ్యే వరకు ఉడికించి దింపాలి. నీళ్లన్నీ తీసేసి సేమ్యా చల్లారేలా చూడాలి. తరువాత స్టవ్‌పై మరో పాన్‌పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి. మినప్పప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు వేరుసెనగలు వేసి కలపాలి. అల్లం ముక్క, పచ్చి మిర్చి వేయాలి. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిబఠాణీ, క్యారెట్‌ తురుము, క్యాప్సికం వేసి మరికాసేపు వేగించుకోవాలి. చివరగా పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి చిన్నమంటపై రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు సేమ్యా వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి. నిమ్మరసం పిండుకుని వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-07-04T18:24:15+05:30 IST