పెరుగు బ్రెడ్‌

ABN , First Publish Date - 2020-05-30T17:38:50+05:30 IST

బ్రెడ్‌ ముక్కలు - నాలుగైదు, పెరుగు - ఒక కప్పు, ఉప్పు - తగినంత,

పెరుగు బ్రెడ్‌

కావలసినవి: బ్రెడ్‌ ముక్కలు - నాలుగైదు, పెరుగు - ఒక కప్పు, ఉప్పు - తగినంత, క్యారెట్‌ తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా, ఆవాలు - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - కొద్దిగా.


తయారీ: బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. తరువాత నూనెలో వేగించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు వేసి వేగించాలి. కరివేపాకు, ఇంగువ వేయాలి. ఇప్పుడు పెరుగు వేసి కలపాలి. కొద్దిగా క్యారెట్‌ తురుము, కొత్తిమీర వేయాలి. తరువాత వేగించి పెట్టుకున్న బ్రెడ్‌ ముక్కలున్న బౌల్‌లో పెరుగు మిశ్రమం వేయాలి. చివరగా మిగిలిన క్యారెట్‌ తురుము, కొత్తిమీరతో గార్నిష్‌ చేసి వడ్డించాలి..

Updated Date - 2020-05-30T17:38:50+05:30 IST