దహీ రోటీ
ABN , First Publish Date - 2020-05-30T17:37:06+05:30 IST
పెరుగు - అరకప్పు, జీలకర్రపొడి(వేగించినది) - రెండు టీస్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత, గోధుమ పిండి - రెండు కప్పులు.
కావలసినవి: పెరుగు - అరకప్పు, జీలకర్రపొడి(వేగించినది) - రెండు టీస్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత, గోధుమ పిండి - రెండు కప్పులు.
తయారీ: ఒక పాత్రలో పెరుగు తీసుకొని అందులో జీలకర్రపొడి, చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత గోధుమపిండి వేసి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. మూతపెట్టి ఒక అరగంటపాటు పక్కన పెట్టాలి. పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీలు చేసుకోవాలి. వీటిని పాన్‌పై కాల్చాలి. కొద్దిగా నూనె పెట్టుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. వేడి వేడిగా తింటే ఈ చపాతీలు టేస్టీగా ఉంటాయి.