పెరుగు వడ
ABN , First Publish Date - 2020-05-30T17:35:38+05:30 IST
మినప్పప్పు - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, ఉప్పు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, పెరుగు - మూడు
కావలసినవి: మినప్పప్పు - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, ఉప్పు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, పెరుగు - మూడు టేబుల్‌స్పూన్లు(ఒక ప్లేట్ కోసం), గ్రీన్ చట్నీ - రెండు టీస్పూన్లు, చింతపండు చట్నీ - రెండు టీస్పూన్లు, కారం - చిటికెడు, జీలకర్రపొడి - చిటికెడు, ఛాట్ మసాలా - చిటికెడు, కొత్తిమీర - ఒకకట్ట.
తయారీ: నానబెట్టుకున్న మినప్పప్పులో పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. మినప్పప్పు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వడలుగా ఒత్తుకుంటూ నూనెలో వేయాలి. చిన్నమంటపై వడలు గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి. అలా వేగించుకున్న వడలను గోరు వెచ్చటి నీళ్లలో వేయాలి. ఐదు నిమిషాల పాటు ఉంచితే వడలు నీటిని గ్రహిస్తాయి. తరువాత వడలను చేతుల్లోకి తీసుకుంటూ, నీరు పోయేలా ఒత్తుతూ మరో ప్లేట్‌లో వేయాలి. ఇప్పుడు ఆ వడల మీద పెరుగు పోయాలి. గ్రీన్ చట్నీ, చింతపండు చట్నీ వేయాలి. కారం, జీలకర్రపొడి, ఛాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు చల్లాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.