వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మృతిపై శివస్వామి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-06-13T22:54:51+05:30 IST
పీఠాధిపతుల బృందం కన్వీనర్ శివస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి
కడప: పీఠాధిపతుల బృందం కన్వీనర్ శివస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మృతిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. వెంకటేశ్వరస్వామి ఆరోగ్యంగా ఉన్నారని, రేపు డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించిన.. మరుసటిరోజే మృతి చెందడంపై అనుమానాలున్నాయని తెలిపారు. వెంకటేశ్వరస్వామి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని శివస్వామి ప్రకటించారు.
బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యం వ్యవహారం పరిష్కరించే ప్రయత్నాలు మొదలు పెట్టిన పలువురు పీఠాధిపతుల బృందం వారసుల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బ్రహ్మంగారిమఠం గత చరిత్రను సూక్ష్మంగా పరిశీలించడంతో పాటు ఇటీవల వారసులతో చర్చించి సమన్వయం కుదిరేలా ప్రయత్నాలు చేశారు. ఈ చర్చల అనంతరం వారసులు నాలుగురోజులు గడువు కోరారు. అయినా పీఠం కోసం పోటీపడుతున్న వారి మధ్య సఖ్యత కుదరలేదు.