YS Jagan ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చా.. ఆదరించండి.. అభివృద్ధి చేస్తా!
ABN , First Publish Date - 2021-10-19T13:05:13+05:30 IST
ఆదరించి, గెలిపించడండి అభివృద్ధి చేస్తానని వైసీపీ...
కడప జిల్లా/బద్వేలు : ఆదరించి, గెలిపించడండి అభివృద్ధి చేస్తానని వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా 24వ వార్డు ప్రజలను కోరారు. సోమవారం 24వ వార్డు వెంకటయ్య నగర్‌లో కౌన్సిలర్ రాగిమాను రవి తేజ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధా మాట్లాడుతూ తన భర్త దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మరణంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని, ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని ఆమె కోరారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా, చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, 23వ వార్డు కౌన్సిలర్ కరిముల్లా, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి, 24వ వార్డు ఇన్‌చార్జి రాగిమాను ప్రతాప్‌కుమార్‌పాల్గొన్నారు.
పోలింగ్ బూత్‌ల పరిశీలన
బద్వేలు ఉపఎన్నికలను పురస్కరించుకొని సోమవారం వరికుంట్ల, గంగనపల్లె, మిద్దెల గ్రామాల్లోని పోలింగ్ బూత్‌లను ఎన్నికల జనరల్ అబ్జర్వర్ భీష్మకుమార్ పరిశీలించారు. ఈయన వెంట డిప్యూటీ తహసీల్దారు రవిశంకర్, వీఆర్వో వేణుగోపాల్ ఉన్నారు.