ప్రజల ప్రాణాలంటే జగన్ రెడ్డికి లెక్కలేదు : ఏలూరి సాంబశివరావు
ABN , First Publish Date - 2021-12-19T16:19:34+05:30 IST
ప్రజల ప్రాణాలంటే సీఎం జగన్ రెడ్డికి లెక్కలేదని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదైనా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వీడరా? అని ప్రశ్నించారు.
అమరావతి : ప్రజల ప్రాణాలంటే సీఎం జగన్ రెడ్డికి లెక్కలేదని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదైనా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వీడరా? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలు జాగ్రత్త చర్యల్లో ముందుంటే ఏపీ ప్రభుత్వం విపక్షాలను వేధించడంలో ముందుందన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా కేసుల్లో 5వ స్థానమని.. టీకా పంపిణీలో 10వ స్థానంలో ఉన్నామని సాంబశివరావు పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన శూన్యమన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు నామమాత్రంగా టెస్టులు నిర్వహిస్తున్నారన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు ఇచ్చే 50,000 పరిహారానికీ సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని ఏలూరి సాంబశివరావు విమర్శించారు.