అనుమతులు ఇవ్వడం సంతోషం

ABN , First Publish Date - 2021-12-31T07:29:18+05:30 IST

అనుమతులు ఇవ్వడం సంతోషం

అనుమతులు ఇవ్వడం సంతోషం

టికెట్‌ రేట్లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి

ఏపీ ఫిలిం చాంబర్‌ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్‌


తిరుపతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో థియేటర్లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రముఖ సినీ నిర్మాత, ఏపీ ఫిలిం చాంబర్‌ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్‌ అన్నారు. తిరుపతిలో గురువారం ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమానులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీజ్‌ చేసిన థియేటర్ల రెన్యువల్‌కు నెల రోజులు సమయం ఇవ్వడం సంతోషమేనన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్ల పరిస్థితి ఘోరంగా తయారైందన్నారు. కరోనాతో రెండేళ్లపాటు ఎన్నో ఇబ్బందులు పడ్డామని తెలిపారు. నిర్మాతలు చెల్లించిన జీఎస్టీ పన్నుల్లోని ఏపీ వాటా గత ఐదేళ్లుగా తెలంగాణలోనే ఉండిపోయిందని, ప్రభుత్వం చొరవ తీసుకుని తెప్పించాలన్నారు. బ్రేకింగ్‌ న్యూస్‌ కోసం ఎవరుపడితే వారు సినీ పరిశ్రమ గురించి మాట్లాడటం సరికాదని, నట్టికుమార్‌కు అవసరమనుకుంటే తెలంగాణలో ప్రత్యేక చాంబర్‌ పెట్టుకోవచ్చని అన్నారు. సినిమా టికెట్ల రేట్లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. కరోనా సమయంలో మూడు నెలల విద్యుత్‌ చార్జీలను మాఫీ చేస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోవాలని కోరారు.

Updated Date - 2021-12-31T07:29:18+05:30 IST