భార్య మర్మాంగాలు కోసేసిన భర్త
ABN , First Publish Date - 2021-05-16T09:42:56+05:30 IST
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చిత్రహింసలకు గురిచేసి కత్తితో మర్మాంగాలు కోసేసిన సంఘటన శనివారం వెలుగు చూసింది
మదనపల్లె క్రైం, మే 15: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చిత్రహింసలకు గురిచేసి కత్తితో మర్మాంగాలు కోసేసిన సంఘటన శనివారం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం పెంచుపాడు పంచాయతీ పాశంవారిపల్లెకు చెందిన కృష్ణ మూర్తి నాటకాలు వేస్తుండేవాడు. కొద్దిరోజులుగా భార్య రాధ (35)పై అనుమానంతో తరచూ కొట్టేవాడు. నాలుగు రోజుల కిందట గ్రామ సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి కాళ్ల్లూ చేతులు కట్టేసి చిత్రహింసలకు గురిచేసి, కత్తితో మర్మాంగాలు కోసేశాడు. బాధితురాలి పుట్టింటివారు శనివారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.