ధాన్యం బకాయిలపై వడ్డీని చెల్లించాలి: ఎమ్మెల్యే నిమ్మల

ABN , First Publish Date - 2021-07-31T09:24:06+05:30 IST

దాళ్వా పంటను అమ్మిన రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను వెంటనే వడ్డీతో సహా చెల్లించాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు

ధాన్యం బకాయిలపై వడ్డీని చెల్లించాలి: ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లు అర్బన్‌, జూలై 30: దాళ్వా పంటను అమ్మిన రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను వెంటనే వడ్డీతో సహా చెల్లించాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు. ఆయన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రైతులు రొడ్డెక్కితేనే కానీ ధాన్యం బకాయిలు విడుదల సాధ్యం కాలేదని అన్నారు. ఐదు వేల కోట్ల బకాయిలపై వడ్డీని ప్రభుత్వమే రైతులకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సకాలంలో ధాన్యం సొమ్ములు విడుదల కాకపోవడంతో రైతులు సుమారు రూ.600 కోట్లు నష్టపోయారని పేర్కొన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్రమ అరెస్టును ఎమ్మెల్యే నిమ్మల ఖండించారు.

Updated Date - 2021-07-31T09:24:06+05:30 IST