AP: వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆర్ధిక సాయం

ABN , First Publish Date - 2021-12-19T15:20:43+05:30 IST

వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ ఆర్ధిక సాయం అందజేయనుంది.

AP: వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆర్ధిక సాయం

అమరావతి: వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ ఆర్ధిక సాయం అందజేయనుంది. రేపు తిరుపతిలో 48 కుటుంబాలకు  ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆర్థిక సాయం అందించనున్నారు. మృతుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందజేస్తారు. అలాగే వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. ట్రస్ట్ ప్రతినిధులు ఇప్పటికే వరద సహాయక చర్యల్లో పాల్గొని సేవలు అందించిన విషయం తెలిసిందే. మూడు జిల్లాలోని వరద ప్రాంతాల్లో బాధితులకు  ట్రస్ట్ యాజమాన్యం నిత్యావసరాలు అందించింది. 

Updated Date - 2021-12-19T15:20:43+05:30 IST