పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితుల ర్యాలీ

ABN , First Publish Date - 2021-12-19T09:08:19+05:30 IST

పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితుల ర్యాలీ

పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితుల ర్యాలీ

పోలవరం, డిసెంబరు 18 : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కరం కోసం ఐక్యవేదిక చేపట్టిన నిరసన దీక్షలు శనివారానికి ఎనిమిదో రోజుకు చేరాయి. ప్రాజెక్టు ఎగువనున్న ముంపు గ్రామాలు కొరుటూరు, శిరివాక, శివగిరి, చీడూరు, తెల్లదిబ్బల గ్రామాల ప్రజలు నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు. తమకు అందాల్సిన పరిహారం అందకుండా తాము గ్రామాలు ఖాళీ చేసేది లేదని స్పష్టంచేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

Updated Date - 2021-12-19T09:08:19+05:30 IST