బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్టీసీ సాయం

ABN , First Publish Date - 2021-12-19T09:07:05+05:30 IST

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్టీసీ సాయం

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్టీసీ సాయం

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 18: పశ్చిమగోదావరి జిల్లాలో జల్లేరు వాగు బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఆర్టీసీ అధికారులు శనివారం పరిహారం అందజేశారు. ఆర్టీసీ ఆర్‌ఎం వీరయ్యచౌదరి మాట్లాడుతూ.. ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మంది ప్రయాణికుల్లో ఆరుగురికి ఒక్కొక్కరికీ రూ.2.5 లక్షల చెక్కులను అందించామన్నారు. మరో ముగ్గురికి చెక్కులు సిద్దంగా ఉన్నాయని అందజేస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.2 లక్షలు రావలసి ఉందని తెలిపారు.

Updated Date - 2021-12-19T09:07:05+05:30 IST