ఏపీలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-08-10T00:52:25+05:30 IST

రాష్ట్రంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. గుంటూరు

ఏపీలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

గుంటూరు: రాష్ట్రంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. గుంటూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జిల్లాలోని వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. కొవ్వూరు ఏషియన్ పెయింట్స్‌ దగ్గర లారీ ఢీకొని రాజమండ్రికి చెందిన దువ్వూరి అజిత్ ( 19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-10T00:52:25+05:30 IST