TS: PRTU State Presidentగా శ్రీపాల్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-10-11T13:29:01+05:30 IST
ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్..
ప్రధాన కార్యదర్శిగా కమలాకర్‌రావు రెండోసారి ఎన్నిక
హైదరాబాద్/నిజామాబాద్ అర్బన్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శ్రీపాల్‌రెడ్డి, బీరెళ్లి కమలాకర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్‌లోని ఓ కన్వెన్షన్‌హాల్‌లో ఆదివారం జరిగిన పీఆర్టీయూ రాష్ట్ర 34వ కౌన్సిల్ సమావేశాల్లో.. రాబోయే రెండు సంవత్సరాలకుగాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కమలాకర్‌రావు ఎన్నిక కావడం ఇది రెండో సారి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, కాటిపల్లి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ సమక్షంలో ఎన్నికల పరిశీలకులు చెన్నకేశవరెడ్డి, కృష్ణమోహన్ పీఆర్టీయూ నూతన అధ్యక్ష, కార్యదర్శులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, శనివారం ప్రారంభమైన పీఆర్టీయూ సమావేశాలు ఆదివారం ముగిశాయి.