మాతృమూర్తిగా అంత ఈజీ కాదు: నటి సోహా అలీఖాన్

ABN , First Publish Date - 2021-07-25T23:35:03+05:30 IST

నేటి ప్రపంచంలో, మాతృమూర్తిగా బాధ్యతలను నిర్వర్తించడం అంత సులభమేమీ కాదు. ఎన్నో అంశాలు మనకు బాధను, ఆందోళనను కలిగిస్తాయి. చాలాసార్లు మనం వ్యక్తిగతంగా బాధ్యత కూడా వహించాల్సి వస్తుంది

మాతృమూర్తిగా అంత ఈజీ కాదు: నటి సోహా అలీఖాన్

‘‘నేటి ప్రపంచంలో, మాతృమూర్తిగా బాధ్యతలను నిర్వర్తించడం అంత సులభమేమీ కాదు. ఎన్నో అంశాలు మనకు బాధను, ఆందోళనను కలిగిస్తాయి. చాలాసార్లు మనం వ్యక్తిగతంగా బాధ్యత కూడా వహించాల్సి వస్తుంది. తన వరకూ, ఓ మాతృమూర్తిగా, తన కుటుంబం ఆరోగ్యం, భద్రత తీవ్ర ఒత్తిడి కలిగిస్తుంది. కానీ గత సంవత్సరంన్నర కాలంగా తాను తెలుసుకున్న అంశమేమిటంటే, చాలా అంశాలు మన  నియంత్రణలో ఉండవు, కానీ  కుటుంబ ఆరోగ్యం మాత్రం మన నియంత్రణలోనే ఉంటుంది’’ అని వెల్లడించారు బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌.


అల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా తాజాగా ఓ  వర్ట్యువల్‌ ప్యానెల్‌ చర్చా కార్యక్రమాన్ని మహమ్మారి అనంతర ప్రపంచంలో వేగంగా మారుతున్నజీవనశైలి వేళ కుటుంబ ఆరోగ్యం పొందడంలో ఎదురవుతున్న సవాళ్లు అనే  అంశంపై నిర్వహించింది. భారతదేశంతో పాటుగా యుఎస్‌ఏకు చెందిన నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆహార, జీవనశైలి పరంగా తప్పనిసరిగా చేసుకోవాల్సిన మార్పులను గురించి చర్చించిన ఈ కార్యక్రమంలో  బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌,  మ్యాక్స్‌హెల్త్‌కేర్‌-ఢిల్లీ,  రీజనల్‌ డైటెటిక్స్‌ హెడ్‌ - రితికా సమద్ధార్‌ ; న్యూట్రిషియనిస్ట్‌ , వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌,  షీలా కృష్ణస్వామి ; అల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా గ్లోబల్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌  వైస్‌ ప్రెసిడెంట్‌ ఎమిలీ ఫ్లీష్మాన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్‌జె షెజ్జీ మోడరేటర్‌గా వ్యవహరించారు.


ఈ చర్చలో సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబ ఆరోగ్య ప్రణాళికలలో భాగంగా మేము ప్రతి రోజూ  బాదములను తింటుంటాం. వీటిని నేరుగా లేదా ఓట్స్‌, షేక్స్‌, స్మూతీలతో కలుపుకుని కూడా తినవచ్చు’’ అని అన్నారు. డైట్‌ పరంగా తాను ఖచ్చితంగా ఉంటానంటూ ఈ విషయంలో తన కుమార్తె పూర్తిగా సహకరిస్తుందన్నారు. సరైన ఆహారం మాత్రమే అందిస్తుంటానని, దానిలో మరోమాటకు తావుండదన్నారు. అలాగే నిద్ర సమయం పరంగా కూడా  బేరసారాలకు ఆస్కారమే లేదన్నారు. పిల్లల పెంపకం పరంగా మాత్రమే కాదు, ఎన్నో విషయాలలో అమ్మ తనకు స్ఫూర్తి అని చెబుతూ అమ్మ తనకు ఎన్నో విధాల సహకరిస్తుంటారన్నారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా కాకుండా తాను ఎలాగైతే వింటానో అలానే చెబుతారన్నారు. ఈ క్రమంలోనే వర్కింగ్‌ మదర్స్‌కు ఏం చెబుతారన్నప్పుడు వాళ్లను తాను చాలా గౌరవిస్తానన్నారు. తన అమ్మ కూడా వర్కింగ్‌ మదర్‌ అని చెప్పారు. ‘ఒకేసారి రెండు చోట్ల ఉండలేం కదా. వర్కింగ్‌ మదర్స్‌కు నేను చెప్పేది ఒక్కటే.. బీ హ్యాపీ. ఏం చేస్తున్నారనే దానిని అభిమానించండి. ఆస్వాదించండి. ఫ్యామిలీ, వర్క్‌ను బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగితే అంతా హ్యాపీనే’ అని అన్నారు.


కుటుంబంలోని ప్రతి వ్యక్తి రోగ నిరోధక శక్తి మెరుగుపరచడంతో పాటుగా జీవనశైలివ్యాధులు విసురుతున్న సవాళ్లను అధిగమించడానికి తీసుకోవాల్సిన అత్యుత్తమ పోషకాలను గురించి ఈ చర్చా కార్యక్రమంలో నొక్కి  చెప్పడంతో పాటుగా పౌష్టికాహారానికి ప్రాధాన్యతనిచ్చుకోవాల్సిన ఆవశ్యకతను సైతం తెలిపారు. బాదములు లాంటి ఆహారాన్ని డైట్‌లో తీసుకోవడం గురించి తెలియజేశారు. ఈ చర్చా కార్యక్రమంలో ప్యానలిస్ట్‌లు తమ ఆరోగ్యం పట్ల అప్రమప్తతతో వ్యవహరించాల్సిన అవసరం గురించి తెలుపుతూనే  భారీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్క అంశాన్నీ వేర్వేరుగా చేయాల్సిన అవసరాన్నీ తెలియజేశారు. ఈ క్రమంలోనే, ప్యానలిస్ట్‌లు సమగ్రమైన డైట్‌తో పాటుగా తరచుగా వ్యాయామాలు చేయడం, ఆలోచనాత్మకంగా స్నాక్స్‌ తీసుకోవడం గురించి కూడా వెల్లడించారు. ఇదే క్రమంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి  తీవ్ర ప్రయత్నాలను చేయాల్సిన ఆవశ్యకతనూ వెల్లడించారు. 


న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌, షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ.. ‘‘ఈ కష్టకాలంలో మనం ముందుకు చేరాలంటే,  పాత అలవాట్లు మార్చుకోవడంతో పాటుగా నూతన, మెరుగైన అలవాట్లను చేసుకోవడం చేయాలి. అనారోగ్యకరమైన, కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని  పోషకాలతో కూడిన బాదములు లేదా తాజా పళ్లతో పూరించాలి. స్నాకింగ్‌ విధానంలో ఈ మార్పులు కుటుంబ సభ్యుల నడుమ మెరుగైన గుండె  ఆరోగ్యానికి తోడ్పాటునందిస్తాయి’’ అని అన్నారు.

Updated Date - 2021-07-25T23:35:03+05:30 IST