పిల్లలతో అనకూడనివి!

ABN , First Publish Date - 2021-04-04T05:30:00+05:30 IST

పిల్లలు ఏది చూసినా, ఏది విన్నా వెంటనే గ్రహించేస్తారు. అందుకే తల్లితండ్రులు వారితో జాగ్రత్తగా మాట్లాడాలి. వారిని మందలించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వారి మనసు నొచ్చుకోకుండా దారిలో

పిల్లలతో అనకూడనివి!

పిల్లలు ఏది చూసినా, ఏది విన్నా వెంటనే గ్రహించేస్తారు. అందుకే తల్లితండ్రులు వారితో జాగ్రత్తగా మాట్లాడాలి. వారిని మందలించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వారి మనసు నొచ్చుకోకుండా దారిలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలి. అందుకు ఏం చేయాలంటే...


  • ‘నువ్వు మీ నాన్నలానో, అమ్మలానో ప్రవర్తిస్తావు’ అని పిల్లలతో అనడం వల్ల లాభం ఉండదు. ఎందుకంటే పోలిక మంచిగానే ఉన్నాకూడా అది మీ పిల్లలను ప్రభావితం చేస్తుంది. 

  • ‘చాలా విసిగిస్తావు’ అంటూ పిల్లల తీరుపై ముద్ర వేయొద్దు. వారి ప్రవర్తన గురించి పాజిటివ్‌గా అన్నా, నెగటివ్‌గా అన్నా అది పిల్లల మనసులో బలంగా నాటుకుంటుంది. అందుకే వారిని ఒక గాటన కట్టొద్దు.

  • ‘మీ నాన్న లేదా అమ్మ వెళ్లాక నీ పని చెబుతా’... అనే మాట పిల్లలను మందలించేందుకు అంటారు. దాంతో పిల్లల్లో అనవసరమైన భయం పెరుగుతుంది.

  • ‘ఆ పని చేసినందుకు థ్యాంక్యూ, ప్రతిసారి నువ్వెందుకు కుదురుగా ఉండవు’ అనడం సరికాదు. తల్లితండ్రులు పిల్లలను ఒక పని బాగా చేశావని మెచ్చుకోవడం, మరో పని సరిగా చేయలేదని తిట్టడం వల్ల మంచిది కాదు. ఆ మాటలను పిల్లలు అవమానంగా భావిస్తారు. 

  • ‘నాకు చికాకు తెప్పిస్తున్నావు’ అంటూ తమ పరిస్థితికి పిల్లలను బాధ్యులు చేయొద్దు. మానసికంగా బలంగా ఉండే తల్లితండ్రులు తమ భావోద్వేగాలు, మానసిక పరిస్థితి విషయమై పిల్లలను తిట్టిపోయరు. 

  • ‘నాతో వాదించకు’ అంటూ పిల్లలను హెచ్చరించడం వారిని క్రమశిక్షణలో పెట్టేందుకు ఏ విధంగానూ తోడ్పడదు. పిల్లలను దారిలో పెట్టేందుకు ప్రేమగా మందలించాలి. ఒకటికి రెండుసార్లు చెప్పి చూడాలి.

Updated Date - 2021-04-04T05:30:00+05:30 IST