మైలీ మతి పోగొట్టింది!
ABN , First Publish Date - 2021-05-12T05:45:37+05:30 IST
ఫ్యాషన్ సరిహద్దులు చెరిపేసి... సరికొత్త స్టయిల్స్‌ను పరిచయం చేయడంలో మైలీ సైర్సను మించిన సెలబ్రిటీ మరొకరు లేరు! అయితే వాటిని చూసి తట్టుకోవాలంటే కాస్తంత గుండె ధైర్యం కావాలి...
ఫ్యాషన్ సరిహద్దులు చెరిపేసి... సరికొత్త స్టయిల్స్‌ను పరిచయం చేయడంలో మైలీ సైర్సను మించిన సెలబ్రిటీ మరొకరు లేరు! అయితే వాటిని చూసి తట్టుకోవాలంటే కాస్తంత గుండె ధైర్యం కావాలి. 28 ఏళ్ల ఈ అమెరికన్ పాప్ స్టార్, నటి మళ్లీ అలాంటి ట్రెండీ ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. లోదుస్తులు కనిపించేలా ఫుల్ లెన్త్ సీక్విన్ ట్రౌజర్ వేసుకుని ఓ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ గెట్పనే తాజాగా అభిమానులతో పంచుకుంది. ప్రముఖ డిజైనర్ అలెగ్జాండర్ వాథియర్ రూపొందించిన ఈ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ మతి పోగొట్టింది. ట్రాన్స్ఫరెంట్ ట్రౌజర్కు మ్యాచింగ్‌గా స్లీవ్‌లెస్ వైట్ టాప్, మెడకు రకరకాల చైన్లు ధరించింది. చేతికి బ్లాక్ గ్లోసీ లేటెక్స్ గ్లౌవ్స్, అదే రంగు పాదరక్షలతో ఫినిషింగ్ టచ్‌నిచ్చింది. ఇక 1980ల్లోని హెయిర్‌స్టయిల్ మైలీకే ప్రత్యేకం.