లవ్‌డబ్‌ లవ్‌డబ్‌...

ABN , First Publish Date - 2021-02-10T07:22:51+05:30 IST

ప్రేమ పక్షులకు ఎంతో ఇష్టమైన మాసం ఫిబ్రవరి. మనసైన వారిపై ప్రేమను వ్యక్తం చేసేందుకు ఇంతకు మించిన సమయం లేదనుకుంటారు ప్రేమికులు. వారం రోజుల పాటు రోజుకో బహుమతితో ప్రేమ పరవశంలో మునిగితేలుతారు...

లవ్‌డబ్‌ లవ్‌డబ్‌...

ప్రేమ పక్షులకు ఎంతో ఇష్టమైన మాసం ఫిబ్రవరి. మనసైన వారిపై ప్రేమను వ్యక్తం చేసేందుకు ఇంతకు మించిన సమయం లేదనుకుంటారు ప్రేమికులు. వారం రోజుల పాటు రోజుకో బహుమతితో ప్రేమ పరవశంలో మునిగితేలుతారు. తమకు ఇష్టమైన వారిని సరికొత్త అనుభూతుల్లో ముంచెత్తుతారు. కొత్తగా ప్రేమలో పడిన వారే కాదు చాన్నాళ్లుగా ప్రేమబంధంలో ఉన్నవారు కూడా వాలంటైన్‌ డే కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తుంటారు. ఇంతకీ వాలంటైన్‌ వీక్‌ విశేషాలు తెలుసా...  


రోజ్‌ డే: ఫిబ్రవరి 7న రోజ్‌ డేతో వాలంటైన్‌ వీక్‌ మొదలవుతుంది. ఈ రోజున ప్రేమికులు ఎర్ర గులాబీ పూలను ఇచ్చిపుచ్చుకొని ప్రేమను వ్యక్తం చేస్తారు. ఎర్ర గులాబీలను ఎంచుకోవడానికి కారణం అవి తాజాదనం, పరిమళం, చిరకాలం నిలిచి ఉండే ప్రేమకు చిహ్నం కావడం. 

ప్రపోజ్‌ డే: ఫిబ్రవరి 8. వివిధ రూపాల్లో తమకు ఇష్టమైన వారిపై ప్రేమను వ్యక్తం చేసే రోజు. ఆ ప్రత్యేకమైన రోజును మధుర జ్ఞాపకంగా మలచుకునేందుకు వారికి బహుమతి, పూలు ఇచ్చి లేదంటే కేకు కోసి ఆ సందర్భాన్ని వారు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు.

చాక్లెట్‌ డే: ఫిబ్రవరి 9. ఇష్టమైన ఒక బాస్కెట్‌లో చాక్లెట్స్‌, ఇతర బహుమతులు ఇస్తే ఇద్దరి మధ్య ప్రేమ మరింత దృఢంగా మారుతుంది. చాక్లెట్‌ డే ముఖ్య ఉద్దేశం వారంటే మీకెంత ఇష్టమో తెలియజేయడం.  

టెడ్డీ డే: ఫిబ్రవరి 10. ప్రేమించిన అమ్మాయికి టెడ్డీబేర్‌ను కానుకగా ఇవ్వడం ద్వారా వారి చిన్ననాటి రోజులను గుర్తుచేస్తుంది. అంతేకాదు క్యూట్‌గా ఉండే టెడ్డీబేర్‌ మీరు తన వెంటే ఉన్నారన్న అనుభూతిని కలగజేస్తుంది.

ప్రామిస్‌ డే: ఫిబ్రవరి 11. ప్రేమికుల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రామిస్‌ డే సూచిస్తుంది. ఇద్దరూ జంటగా ఎల్లకాలం ఉంటానని ప్రామిస్‌ చేస్తారు ప్రేమికులు. మీ ప్రామిస్‌ను గుర్తుచేసేలా ఉన్న కానుక ఇస్తే బాగుంటుంది.

హగ్‌ డే: ఫిబ్రవరి 12. ప్రేమను అందంగా వ్యక్తంచేసే రోజు. వేల పదాల్లో చెప్పలేని భావాన్ని ఒక్క కౌగిలింతతో చెప్పవచ్చు. ఎప్పుడూ తనను ప్రేమిస్తూ ఉంటానని తెలిసేలా చేయండి.

కిస్‌ డే: ఫిబ్రవరి 13. కొత్త ప్రేమికులు ఈ రోజు ముద్దుతో తమ ప్రేమ సంకల్పాన్ని చాటుకుంటారు. ఏది ఏమైనా మీరు ఒక్కటిగా ఉంటారనే దానికి ముద్దు ఒక సంకేతం. 

వాలంటైన్‌ డే: ఫిబ్రవరి 14. వాలంటైన్‌ వీక్‌ ఈ రోజుతో ముగుస్తుంది. ప్రేమికులు ఈ రోజును పండగలా భావిస్తారు. ఇద్దరూ సంతోషంగా, తమ తొలి ప్రేమ ఊసులను చెప్పుకొంటూ సమయం గడుపుతారు.

Updated Date - 2021-02-10T07:22:51+05:30 IST