టేలర్‌ ‘ఫియర్‌లెస్‌’

ABN , First Publish Date - 2021-04-14T05:35:42+05:30 IST

పాత పాటలను కొత్తగా వినిపించడం కొత్తేమీ కాదు. అమెరికా పాప్‌ స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్‌ కూడా అలాంటి ప్రయోగమే చేసింది. 2008లో సూపర్‌హిట్‌ అయిన తన ఆల్బమ్‌ ‘ఫియర్‌లెస్‌’ను ఇప్పుడు రీరికార్డింగ్‌ చేసి వదిలింది. స్విఫ్ట్‌కు స్టార్‌డమ్‌ తెచ్చిన ట్రాక్స్‌ అవి

టేలర్‌ ‘ఫియర్‌లెస్‌’

పాత పాటలను కొత్తగా వినిపించడం కొత్తేమీ కాదు. అమెరికా పాప్‌ స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్‌ కూడా అలాంటి ప్రయోగమే చేసింది. 2008లో సూపర్‌హిట్‌ అయిన తన ఆల్బమ్‌ ‘ఫియర్‌లెస్‌’ను ఇప్పుడు రీరికార్డింగ్‌ చేసి వదిలింది. స్విఫ్ట్‌కు స్టార్‌డమ్‌ తెచ్చిన ట్రాక్స్‌ అవి. ఎన్నో ప్రత్యేకతలున్న ‘ఫియర్‌లెస్‌’... ‘బెస్ట్‌ ఆల్బమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా గ్రామీ అవార్డు గెలుచుకుంది. ప్రతిష్టాత్మక ‘రికార్డింగ్‌ ఇండస్ర్టీ అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికా’ నుంచి ‘డైమండ్‌’గా అరుదైన గుర్తింపు దక్కించుకుంది. అమెరికాలోనే కాకుండా కెనడా, ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌, నార్వే, బ్రిటన్‌ తదితర దేశాల్లో చాలా కాలంపాటు టాప్‌-5లో కొనసాగింది. ప్రపంచవ్యాప్తంగా 12 మిలియన్ల కాపీలు అమ్ముడయ్యాయి. అంతేకాదు... 21వ శతాబ్దంలోనే అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్స్‌లో ఒకటిగా నిలిచి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులోని మొత్తం 13 పాటల్లో ఎనిమిదింటిని ఆమే రాసింది. 


‘ఫియర్‌లెస్‌ (టేలర్‌ వెర్షన్‌)’ పేరుతో వచ్చిన తాజా ఆల్బమ్‌లో మొత్తం 26 ట్రాక్స్‌ ఉన్నాయి. నాడు విడుదలకు నోచుకోని పాటలు కూడా ఇందులో అదనంగా చేర్చింది స్విఫ్ట్‌. పదకొండు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆమె... కొత్త ఆల్బమ్‌ను విడుదల చేసినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటింది. 153 మిలియన్లమంది ఇన్‌స్టా ఫాలోవర్స్‌ గల కొద్దిమంది సెలబ్రిటీల్లో స్విఫ్ట్‌ పేరే ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె పాట ఒకటి వస్తుందంటే పనులన్నీ మానుకొని దాని కోసమే వేచివుండే అభిమానులకు లెక్కే ఉండదు. తాజా ఆల్బమ్‌ను ఇప్పటికే వివిధ మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్‌లపై లక్షలమంది ఆస్వాదిస్తున్నారు.

Updated Date - 2021-04-14T05:35:42+05:30 IST