‘కంఫర్ట్’ మంత్ర
ABN , First Publish Date - 2021-08-11T05:30:00+05:30 IST
కరోనా దెబ్బకు ఇళ్లే ఆఫీసులుగా మారిపోయాయి. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ లాగిన్స్ సాధారణమయ్యాయి. ఈ ‘న్యూ నార్మల్’ ఉద్యోగుల జీవన శైలినే కాదు..
కరోనా దెబ్బకు ఇళ్లే ఆఫీసులుగా మారిపోయాయి. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ లాగిన్స్ సాధారణమయ్యాయి. ఈ ‘న్యూ నార్మల్’ ఉద్యోగుల జీవన శైలినే కాదు... ఫ్యాషన్ రంగంలోని నిపుణులు, బ్రాండ్‌ల ఆలోచనలనూ మార్చేసింది. స్కిన్నీ జీన్స్‌లు, ఊపిరాడని టాప్‌లకు బదులు ఇప్పుడు ‘కంఫర్ట్’ పేరిట పాతవే కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో పేరు పొందిన బడా బ్రాండ్స్ సైతం ఆ దారిలోనే నడవక తప్పడంలేదు. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ‘గెస్’ ఒక కలెక్షన్ వదిలింది. నవతరాన్ని దృష్టిలో పెట్టుకుని ‘అథ్లెషర్’ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చిన ఈ కలెక్షన్ ప్రధాన ఉద్దేశం కంఫర్ట్. ధరిస్తే గాలి జొరబడేలా, సౌకర్యవంతంగా ఉంటాయి. అదే సమయంలో స్టయిల్‌గానూ కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ సెగ్మెంట్‌నే పట్టించుకోని ‘గెస్’... ఇప్పుడు తమ కలెక్షన్లలో పదో వంతు స్పోర్టివ్ లుక్స్‌తో, సౌకర్యవంతమైన డ్రెస్‌లు ఉండేలా చూసుకొంటోంది. కొవిడ్ నేపథ్యంలో ‘స్టయిల్’ మార్చక తప్పలేదని సంస్థ ప్రకటించింది.