అదే అందం
ABN , First Publish Date - 2021-01-06T05:30:00+05:30 IST
భిన్నత్వంలో ఏకత్వం భారతీయతలో ఉన్న గొప్పదనం. దాన్ని ప్రతిబింబించేలా మత విశ్వాసాల్లో ఉన్న వైవిధ్యాన్ని థీమ్‌గా ఎంచుకుని...
భిన్నత్వంలో ఏకత్వం భారతీయతలో ఉన్న గొప్పదనం. దాన్ని ప్రతిబింబించేలా మత విశ్వాసాల్లో ఉన్న వైవిధ్యాన్ని థీమ్‌గా ఎంచుకుని... ఒకే చిత్రంలో దాన్ని చూపే ప్రయత్నం చేశాడు ప్రముఖ ఫొటోగ్రాఫర్ బిక్రమ్‌జిత్ బోస్. నటి జోయా హుస్సేన్‌పై తీసిన ఈ ఫొటోకు ‘ఈక్వల్లీ బ్యూటిఫుల్’ అనే టైటిల్ పెట్టారు.
భిన్న సంస్కృతులను ప్రతిబింబించేలా నాలుగు రకాల సంప్రదాయ ఆహార్యాల్లో జోయా కనిపిస్తుందీ ఫొటోలో. కట్టూ బొట్టులో వైవిధ్యం ఉన్నా ‘అందం అదే’ననే ఓ శక్తివంతమైన సందేశాన్ని సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేశాడు బిక్రమ్‌జిత్ బోస్. ఈ థీమ్‌కు రూపకల్పన ప్రముఖ డిజైనర్ రితూ కుమార్.
‘ఈక్వల్లీ బ్యూటిఫుల్’ పేరిట దీన్ని ఒక క్యాంపెయిన్‌గా మలిచి, దానికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు పారిశ్రామికవేత్త అమ్రిష్ కుమార్. దేశ రాజధాని ఢిల్లీలోని హోర్డింగ్స్‌పైన, అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా ఈ క్యాంపెయిన్‌ను ఆవిష్కరించారు. నెట్టింట ఇప్పుడిది చక్కర్లు కొడుతోంది. ఎందరో కళాభిమానులను ఆకట్టుకుంటోంది.