గురు తెఘ్ బహదూర్ 400వ జయంతి.. న్యూజెర్సీ కీలక నిర్ణయం!
ABN , First Publish Date - 2021-03-30T14:54:49+05:30 IST
సిక్కుల తొమ్మిదో గురువు గురు తెఘ్ బహదూర్ 400వ జయంతిని పురుస్కరించుకుని అమెరికాలోని న్యూజెర్సీ సెనేట్ కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూజెర్సీ: సిక్కుల తొమ్మిదో గురువు గురు తెఘ్ బహదూర్ 400వ జయంతిని పురుస్కరించుకుని అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్ర సెనేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన జయంతిని ఇకపై‘మానవ హక్కులు మరియు మత స్వేచ్ఛా దినోత్సవం’గా జరుపుకోవాలని న్యూజెర్సీ సెనేట్ నిర్ణయించింది. ఈ మేరకు సెనేట్ ప్రెసిడెంట్ స్టీవ్ స్వీనీ, అసెంబ్లీ స్పీకర్ క్రైగ్ కొగ్లిన్ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిక్కు సమన్వయ కమిటీ ఈస్ట్ కోస్ట్(ఎస్సీసీఈసీ) కార్యకర్తలను సైతం సన్మానించారు. సిక్కు సమాజానికి ఇది గొప్ప రోజు అని ఎస్సీసీఈసీ సమన్వయకర్త హిమ్మత్ సింగ్ అన్నారు. 1675లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు బలవంతంగా హిందువులను మతమార్పిడికి పాల్పడుతుంటే.. దీనికి వ్యతిరేకంగా గురు తేఘ్ బహదూర్ తన జీవితాన్ని త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. దేశంలోనే న్యూజెర్సీ వైవిధ్యమైన రాష్ట్రమని, దాని బహుళ సంస్కృతిలో సిక్కు సమాజాన్ని చోటు కల్పించడం గర్వించదగిన విషయమంటూ హిమ్మత్ సింగ్ చెప్పుకొచ్చారు.