యూఎస్ ర్యాపర్ సరికొత్త ఆవిష్కరణ.. మాస్క్‌కు టెక్ హంగులు

ABN , First Publish Date - 2021-04-07T15:28:38+05:30 IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది.

యూఎస్ ర్యాపర్ సరికొత్త ఆవిష్కరణ.. మాస్క్‌కు టెక్ హంగులు

కాలిఫోర్నియా: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది. దీంతో ఇప్పటికే మార్కెట్‌లో వివిధ రకాల మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికా ర్యాపర్ విలియం ఆడమ్స్ సరికొత్త ఫేస్‌మాస్క్‌ను ఆవిష్కరించారు. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, నాయిస్ క్యాన్సిలేషన్ ఆడియోతో ఇయర్ ఫోన్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వంటి టెక్ హంగులతో ఈ ఫేస్‌మాస్క్‌ను విలియం రూపొందించారు. అలాగే త్రీ స్పీడ్ డ్యూయల్ ఫ్యాన్స్, వెంటిలేషన్, హెపా(హెచ్ఈపీఏ) ఫిల్టర్స్, ఒక్కసారి చార్జీతో 7 గంటల పాటు పని చేసే బ్యాటరీ తదితర సదుపాయాలు ఈ మాస్క్ సొంతం. హనీవెల్ కంపెనీతో కలిసి XUPERMASK పేరిట గురువారం ఈ మాస్క్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రెండు వెరియంట్లలో దీన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ఇంతకు దీని ధర ఎంతో చెప్పలేదు కదూ. 299 డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.22వేలు).   



Updated Date - 2021-04-07T15:28:38+05:30 IST