వైరల్: 17ఏళ్ల క్రితం బర్గర్ కొన్నారు.. కానీ తినలేదు.. ఇప్పుడది ఎలా ఉందంటే!

ABN , First Publish Date - 2021-03-21T02:48:23+05:30 IST

సాధారణంగా అందరూ.. ఆహారపదార్థాలను తినడం కోసం కొనుగోలు చేస్తారు. కొనుక్కొని తెచ్చుకున్న పదార్థాలను తింటూ వాటి రుచిని ఆస్వాధిస్తారు. కానీ కొందరు మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. ఆహార పదార్థాలను

వైరల్: 17ఏళ్ల క్రితం బర్గర్ కొన్నారు.. కానీ తినలేదు.. ఇప్పుడది ఎలా ఉందంటే!

వాషింగ్టన్: సాధారణంగా అందరూ.. ఆహారపదార్థాలను తినడం కోసం కొనుగోలు చేస్తారు. కొనుక్కొని తెచ్చుకున్న పదార్థాలను తింటూ వాటి రుచిని ఆస్వాధిస్తారు. కానీ కొందరు మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. ఆహార పదార్థాలను కొనుగోలు చేసి.. రోజుల వ్యవధిలో అవి ఏ విధంగా రూపాంతరం చెందాయో పరిశీలిస్తూ గడిపేస్తుంటారు. అందులోనే తమ ఆనందాన్ని వెతుకుంటారు. అమెరికాకు చెందిన ఓ మహిళ కూడా ఈ కోవకు చెందిందే. అమెరికాకు చెందిన ఓ మహిళ..  మెక్‌డోనల్డ్స్ బర్గర్, ఫ్రైస్‌ను 2004లో కొనుగోలు చేసింది. వాటిని తినకుండా.. కనీసం కవర్ కూడా విప్పకుండా ఏకంగా 17ఏళ్లపాటు భద్రపరిచింది. తాజాగా అవి ఏవిధంగా రూపాంతంర చెందాయో తెలుసుకునేందుకు సదరు మహిళ ఆసక్తి చూపించింది. అంతేకాకుండా 17ఏళ్ల తర్వాత ఆ పదార్థాల రూపం ఏ విధంగా ఉంటుందో నలుగురికీ చూపించాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా.. వాటిని వీడియో తీసి.. టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. కాగా.. ఈ వీడియోను చూసేందుకు నెటిజన్లు ఎగబడ్డారు. గంటల వ్యవధిలోనే లక్షల మంది ఈ వీడియోను చూడగా.. చాలా మంది దాన్ని లైక్ కూడా చేశారు. ఇదిలా ఉంటే.. ఆ బర్గర్ మాత్రం ముడుచుకుపోయి గట్టిగా తయారైనట్టు కనిపిస్తుండగా.. ఫ్రైస్ మాత్రం తాజాగా  ఉన్నట్టనిపిస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 




Updated Date - 2021-03-21T02:48:23+05:30 IST