మేకిన్ ఇండియా వ్యాక్సిన్ తీసుకున్న కాంబోడియా ప్రధాని

ABN , First Publish Date - 2021-03-11T06:33:07+05:30 IST

కాంబోడియా ప్రధాని హున్ సేన్ భారత్‌లో తయారైన కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని

మేకిన్ ఇండియా వ్యాక్సిన్ తీసుకున్న కాంబోడియా ప్రధాని

న్యూఢిల్లీ: కాంబోడియా ప్రధాని హున్ సేన్ భారత్‌లో తయారైన కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని కాంబోడియాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాంబోడియా ప్రధాని హున్ సేన్, ఆ దేశ ప్రథమ మహిళ, అసెంబ్లీ అధ్యక్షుడు, ఆరోగ్యశాఖ మంత్రితో పాటు ఇతర మంత్రులు రాజధాని ఫోమ్‌ పెన్‌లోని ఓ ఆసుపత్రిలో సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మొదటి డోసును బుధవారం రోజు తీసుకున్నట్టు ఇండియన్ ఎంబసీ ట్విట్టర్‌లో పేర్కొంది. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోలను సైతం పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాల్సిందిగా కాంబోడియా ప్రధాని హున్ సేన్.. భారత ప్రధాని నరేంద్రమోదీని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 1లక్ష కొవిడ్ వ్యాక్సిన్ డోసులను కాంబోడియాకు పంపించేందుకు భారత ప్రభుత్వం ఫిబ్రవరి 6న అంగీకరించింది. కాగా.. జనవరి 20 నుంచి భూటాన్, మాల్దీవులు, బహ్రెయిన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలకు వ్యాక్సిన్‌ను భారత దేశం అందించిన విషయం తెలిసిందే. ః




Updated Date - 2021-03-11T06:33:07+05:30 IST