వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న 50 దేశాల వివరాలివే!

ABN , First Publish Date - 2021-01-02T14:19:48+05:30 IST

వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న 50 దేశాల వివరాలివే!

వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న 50 దేశాల వివరాలివే!

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏ దేశాల్లో నడుస్తోంది.. ఎప్పటినుంచి నడుస్తోందో ఒకసారి చూద్దాం..


రష్యా

ఇక్కడ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం డిసెంబరులోనే ప్రారంభమైంది. వీళ్లు అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌కు బెలారస్‌, అర్జెంటీనా దేశాలు కూడా ఆమోదం తెలిపాయి. ఈ వ్యాక్సిన్‌ సామర్ధ్యం 91.40 శాతం. 


బ్రిటన్‌

ఇక్కడ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం డిసెంబరు 8నే మొదలైంది. 9,50,000 మందికి టీకా అందించారు. తాజాగా ఆమోదించిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌.. జనవరి 4న అందుబాటులోకి రానుంది.


అమెరికా, కెనడా

ఇక్కడ డిసెంబరు 14న వ్యాక్సినేషన్‌ మొదలైంది. ఇక్కడ ఫైజర్‌, మొడెర్నా వ్యాక్సిన్‌లకు అనుమతి లభించింది. అమెరికాలో ఇప్పటికే 28 లక్షల మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయింది. 


యూరప్‌ దేశాలు

అత్యధిక యూరప్‌ దేశాలు డిసెంబరు 27 కన్నా ముందుగానే వ్యాక్సినేషన్‌ను ప్రారంభించేశాయి. జర్మనీలో అత్యధికంగా 1,30,000 మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్‌ పూర్తయింది. అన్ని దేశాలూ ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌లనే వాడుతున్నాయి. 


చైనా

ఇక్కడ వేసవిలోనే వ్యాక్సినేషన్‌ మొదలైపోయింది. 50 లక్షల మందికి ఇప్పటికే టీకా అందించారు. సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌.. 79 శాతం సామర్ధ్యం కలిగి ఉంది.


గల్ఫ్‌ దేశాలు

యూఏఈలో డిసెంబరు 14న సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌తో టీకా కార్యక్రమం మొదలుకాగా.. దుబాయిలో ఫైజర్‌ వ్యాక్సిన్‌తో డిసెంబరు 23న ప్రారంభమైంది. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లో డిసెంబరు 17 నుంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుండగా.. డిసెంబరు 23న ఖతర్‌లో, 24న కువైట్‌లో, 27న ఒమన్‌లో మొదలైంది. ఇజ్రాయెల్‌లో డిసెంబరు 19న మొదలై.. ఇప్పటికే 8 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Updated Date - 2021-01-02T14:19:48+05:30 IST