190 దేశాల్లో 17 భాషల్లో.. ‘జగమే తంత్రం’
ABN , First Publish Date - 2021-06-17T05:29:15+05:30 IST
హీరో ధనుశ్, దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ కాంబినేషన్‌లో తెరెకెక్కిన చిత్రం ‘జగమే తంత్రం’ (తమిళంలో జగమే తందిరమ్). సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని శశికాంత్, చక్రవర్తి రామచంద్ర సం
హీరో ధనుశ్, దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ కాంబినేషన్‌లో తెరెకెక్కిన చిత్రం ‘జగమే తంత్రం’ (తమిళంలో జగమే తందిరమ్). సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని శశికాంత్, చక్రవర్తి రామచంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో డాన్ పాత్ర పోషించిన ధనుష్ సరసన కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలకానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని థియేటర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ అవేవీ సక్సెస్ కాలేదు. దీంతో మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు మొగ్గు చూపారు.
దీంతో ఈ నెల 18వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కానుంది. అయితే, ఈ మూవీ 190 దేశాల్లో 17 భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ అన్ని ఏర్పాట్లుచేసింది. ముఖ్యంగా మాతృభాష తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోలిష్, పోర్చుగీస్, బ్రెజిలియన్, స్పానిష్, థాయ్, ఇండోనేషియా, వియత్నామిస్ తదితర భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్ర కథ సింహభాగం లండన్ నేపథ్యంలో సాగుతుంది.