తగ్గేదేలే.. Americaలో కలెక్షన్ల వర్షం.. రికార్డు సృష్టించిన ‘పుష్ప’
ABN , First Publish Date - 2021-12-18T00:42:21+05:30 IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల వరకు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సి
ఎన్నారై డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల వరకు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ మొత్తంలో కలెక్షన్లు రాబడుతోంది. ఈ క్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ రమేష్ బాలా చేసిన ఓ ట్వీట్ ఆసక్తిగా మారింది. స్టైలిష్ స్టార్.. తన పాత్రలో జీవించినట్టు అభిప్రాయపడ్డారు.
బన్నీ.. బాడీ లాంగ్వేజ్, మ్యానరిజం, డైలగ్ డెలివరీపై ప్రశంసలు కురిపించారు. వన్ మ్యాన్ షోగా సినిమా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ‘పుష్ప’ మూవీ.. అగ్రరాజ్యం అమెరికాలో సృష్టించిన రికార్డు గురించి వెల్లడించారు. ప్రీమియర్ షోల ద్వారా యూఎస్ఏలో ఏకంగా 530వేల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.4కోట్లు) ఈ మూవీ రాబట్టి రికార్డు సృష్టించదని తెలిపారు. మహమ్మారి సమయంలో ఏ భారతీయ సినిమా కూడా ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాలేదని అన్నారు.
ఇదిలా ఉంటే.. ‘పుష్ప’ ఓవర్సీస్ రైట్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ రూ.14 కోట్లకు అమ్మినట్లు సమాచారం. వీటిలో కేవలం అమెరికా ద్వారానే రూ.10కోట్ల మేర వచ్చాయి. హాంసిని ఎంటర్టైన్మెంట్స్, క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా అమెరికా వ్యాప్తంగా సుమారు 389 స్క్రీన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేశాయి.
కాగా.. సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా కనిపించగా.. పల్లెటూరి యువతి గెటప్‌లో రష్మిక యువతను ఆకట్టుకుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు ప్రేక్షకులు పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు.