అమెరికాలో Pushpa కలెక్షన్ల వర్షం.. ప్రీమియర్ షోలకే Allu Arjun సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..
ABN , First Publish Date - 2021-12-17T14:24:42+05:30 IST
లెక్కల మాస్టారు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఊరమాస్ మూవీ 'పుష్ప' శుక్రవారం(డిసెంబర్ 17) ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే.
ఎన్నారై డెస్క్: లెక్కల మాస్టారు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఊరమాస్ మూవీ 'పుష్ప' శుక్రవారం(డిసెంబర్ 17) ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న పుష్ప ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల వరకు థియేటర్లలో రిలీజ్ అవుతోంది. అటు ఓవర్సీస్‌లోనూ పుష్ప భారీగానే విడుదలవుతుంది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఓవర్సీస్ రైట్స్‌ను రూ. 14 కోట్లకు అమ్మినట్లు సమాచారం. వీటిలో కేవలం అమెరికా ద్వారానే రూ. 10కోట్ల మేర వచ్చాయి. హాంసిని ఎంటర్టైన్మెంట్స్, క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా అమెరికా వ్యాప్తంగా సుమారు 389 స్క్రీన్స్‌లో పుష్పను విడుదల చేస్తున్నాయి.
కాగా, స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో వస్తున్న 'స్పైడర్ మ్యాన్ నో వే హోం' మూవీ నుంచి పుష్పకు పోటీ తప్పకపోవడంతో ఓవర్సీస్‌లో భారీగా థియేటర్లు దొరకని పరిస్థితి. ఇది కొంచెం పుష్ప కలెక్షన్లపై ప్రభావం చూపవచ్చు. అటు ఈ సినిమా రన్‌టైమ్(179 నిమిషాలు) కూడా ఓవర్సీస్ ప్రేక్షకులకు పెద్ద పరీక్ష అనే చెప్పాలి. ఇన్ని అడ్డంకుల మధ్య ఓవర్సీస్‌లో పుష్ప గట్టేకాలంటే రూ. 14కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాల్సిందే. అయితే, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేశాయి. చివరగా వదిలిన సమంత ఐటెం సాంగ్ 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' కూడా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం పుష్పకు మేజర్ అసెట్ అని చెప్పాలి. మూవీ బీజీఎం వేరే లెవల్‌లో ఉంది. ఇక సుక్కు, బన్నీ కాంబోలో వచ్చిన 'ఆర్య', 'ఆర్య-2' సినిమాలు మంచి విజయం సాధించడంతో 'పుష్ప'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి. గురువారం(డిసెంబర్ 16) నాటి ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా యూఎస్‌లో 3.50లక్షల డాలర్లు(రూ. 2.67కోట్లు) కొల్లగొట్టింది. అయితే, రూ. 10 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మిగతా రన్‌టైమ్‌లో పుష్ప సుమారు ఒక మిలియన్ డాలర్లు(రూ.7.33కోట్లు) కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.