అమెరికాలో కుమ్మేస్తున్న Pushpa.. బ్రేక్ ఈవెన్‌కు అడుగు దూరంలో..
ABN , First Publish Date - 2021-12-21T19:15:01+05:30 IST
ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన 'పుష్ప- ది రైజ్' అంతే భారీ వసూళ్లతో కుమ్మేస్తోంది. విడుదలై నాలుగు రోజులు గడిచిన సినిమా కలెక్షన్లు అంతే స్టడీగా కొనసాగుతున్నాయి.
ఎన్నారై డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన 'పుష్ప- ది రైజ్' అంతే భారీ వసూళ్లతో కుమ్మేస్తోంది. విడుదలై నాలుగు రోజులు గడిచిన సినిమా కలెక్షన్లు అంతే స్టడీగా కొనసాగుతున్నాయి. ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు అన్ని భాషల్లో భారీ వసూళ్లు రాబడుతోంది. ఇక ఓవర్సీస్‌లో కూడా మూవీ మంచి కలెక్షన్లు కొల్లగొడుతోంది. అటు అమెరికాలో ఏకంగా 389 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచే భారీ వసూళ్లు రాబడుతోంది. అక్కడ ప్రీమియర్ షోల ద్వారా 5లక్షల 43వేల డాలర్లు(రూ.4.10కోట్లు) వస్తే, తొలి రోజు మరో 4లక్షల 30వేల డాలర్లు(రూ.3.25కోట్లు) కొల్లగొట్టింది. మూడో రోజు 3లక్షల 94వేల డాలర్లు(రూ.2.97కోట్లు), నాల్గో రోజు లక్ష 11వేల డాలర్ల(రూ.84లక్షలు) కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ మూవీ ఇప్పటివరకు మొత్తంగా సుమారు 17లక్షల 37వేల డాలర్లు(రూ.13కోట్లు) గ్రాస్ రాబట్టింది. అంటే.. షేర్ వైజ్ చూసుకుంటే సుమారు రూ.9కోట్లు. అయితే, అగ్రరాజ్యంలో ఈ మూవీని విడుదల చేసిన హాంసిని ఎంటర్టైన్మెంట్స్, క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నుంచి సుమారు రూ.10కోట్లకు సినిమా రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో ఒక కోటి రూపాయలు రాబడితే సరిపోతుంది.