'తానా' కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్‌గా రాజా కసుకుర్తి
ABN , First Publish Date - 2021-06-03T17:12:30+05:30 IST
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021- 23 ఎన్నికల్లో కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ పదవికి జరిగిన ఎన్నికల్లో రాజా కసుకుర్తి విజయం సాధించారు. కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే రాజా కనుకుర్తి విజయం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. న్యూజెర్సీలో స్థిరపడిన రాజాకసుకుర్తి సొంత ఊరు ఏపీలోని కృష్ణాజిల్లా బావులపాడు మండలం వీరవల్లి.
వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021- 23 ఎన్నికల్లో కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ పదవికి జరిగిన ఎన్నికల్లో రాజా కసుకుర్తి విజయం సాధించారు. కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే రాజా కనుకుర్తి విజయం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. న్యూజెర్సీలో స్థిరపడిన రాజాకసుకుర్తి సొంత ఊరు ఏపీలోని కృష్ణాజిల్లా బావులపాడు మండలం వీరవల్లి. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ చదివారు. ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలోనే పనిచేస్తున్నారు.
రాజా కసుకుర్తి ఇంతకుముందు తానా బ్యాక్ ప్యాక్ కో చైర్, తానా రీజినల్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ పదవికి పోటీ చేసి విజయాన్ని సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు కుట్టుమిషన్లు, వేలాది మంది పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లు, వ్యవసాయదారులకు రైతు రక్షణ కిట్లు, పవర్ స్ప్రేయర్ల పంపిణీ చేశారు. అలాగే పోచంపల్లి చేనేత కార్మికులకు ఆసు యంత్రాల పంపిణీకి సహాయం చేయడంతో పాటు హెల్త్ క్యాంపులు వంటివి నిర్వహించి కమ్యూనిటీకి తనవంతుగా సేవ చేస్తున్నారు. తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ తనను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన రాజా కసుకుర్తి.. ఇక ముందు కూడా కమ్యూనిటికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు.