American సెనేట్‌లో కీలక బిల్లు.. NRI పిల్లలకు భారీ మేలు!
ABN , First Publish Date - 2021-09-17T02:21:19+05:30 IST
నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాపై అగ్రరాజ్యం అమెరికా వలస వెళ్లిన వారి పిల్లలకు(డాక్యుమెంటెడ్ డ్రీమర్) పౌరసత్వం కల్పించే దిశగా ముందడుగు పడింది. దీనికోసం బుధవారం సెనేటర్లు అలెక్స్ పడిల్లా(డెమొక్రటిక్ పార్టీ), రాండ్ పాల్(రిపబ్లికన్).. 'అమెరికా చిల్డ్రన్ యాక్ట్' పేరిట సెనేట్‌లో కీలక బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో సుమారు 2లక్షల మందికి పైగా డాక్యుమెంటెడ్ డ్రీమర్లకు..
వాషింగ్టన్: నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాపై అగ్రరాజ్యం అమెరికా వలస వెళ్లిన వారి పిల్లలకు(డాక్యుమెంటెడ్ డ్రీమర్) పౌరసత్వం కల్పించే దిశగా ముందడుగు పడింది. దీనికోసం బుధవారం సెనేటర్లు అలెక్స్ పడిల్లా(డెమొక్రటిక్ పార్టీ), రాండ్ పాల్(రిపబ్లికన్).. 'అమెరికా చిల్డ్రన్ యాక్ట్' పేరిట సెనేట్‌లో కీలక బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో సుమారు 2లక్షల మందికి పైగా డాక్యుమెంటెడ్ డ్రీమర్లకు లబ్ధి చేకూరనుంది. అగ్రరాజ్యంలో దీర్ఘకాలంగా నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాపై నివాసముంటున్న వారిపై ఆధారపడుతున్న పిల్లలను 'డాక్యుమెంటెడ్ డ్రీమర్స్' అని అంటారు. వారిలో ఎక్కువ మంది తల్లిదండ్రులతో కలిసి చిన్నారులుగా అగ్రరాజ్యం వచ్చిన భారతీయులే ఉన్నారు. సుమారు 70 శాతం మంది భారతీయులే ఉన్నట్లు సమాచారం. ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్లకు అమెరికన్ పౌరసత్వం ఇచ్చేందుకు అమెరికా చిల్డ్రన్ యాక్ట్ వీలు కల్పిస్తోంది.
ఇవి కూడా చదవండి..
రికార్డు స్థాయిలో Kuwait కు గుడ్ బై చెప్పిన వలసదారులు.. ఏడాదిన్నరలో..
ఇకపై NRI లకు పిల్లలను దత్తత తీసుకోవడం చాలా సులువు..
ఇక అమెరికన్ చట్టాల ప్రకారం పిల్లలను 21ఏళ్లు దాటిన తర్వాత డిపెండెంట్లుగా పరిగణించరు. వారికి గ్రీన్ కార్డులు లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ స్టేటస్ లేకపోతే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. లేదా ఇంటర్నెషనల్ స్టూడెంట్ వీసా తీసుకోవాలి. ఇది చాలా వ్యయంతో కూడింది. అంతేగాక ఉపాధి అవకాశాలు పొందడంలోనూ పరిమితి ఉంటుంది. ఫలితంగా చాలామంది ప్రవాసుల పిల్లలు అమెరికా వదిలి వారివారి దేశాలకు వెళ్లిపోతుంటారు. ఇలాగే తాము తిరిగి వెళ్లిపోవాలేమోనని అనేకమంది ప్రవాస భారతీయుల పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందితే వారికి భారీ ఉపశమనం లభించనుంది.
ఈ బిల్లును ప్రవేశపెట్టిన సెనేటర్ అలెక్స్ పడిల్లా మాట్లాడుతూ.. "తమ జీవితాల్లో అధిక భాగం అగ్రరాజ్యంలోనే ఉండి, ఈ దేశాన్ని తమ సొంత ఇళ్లుగా భావించేవారికి అన్యాయం జరగబోదు. వారి ఆశయాలకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం గ్రీన్‌కార్డ్ జారీలో తప్పిదాల వల్ల వారు శిక్ష అనుభవించకూడదు. ఇలాంటి చిన్నారులకు అమెరికా చిల్డ్రన్ యాక్ట్ ఉపశమనం కలిగిస్తుంది." అని పేర్కొన్నారు.