కుటుంబం, కుటుంబం.. అనేవాళ్లతో కేర్‌ఫుల్‌గా ఉండాలి: ప్రకాశ్‌రాజ్
ABN , First Publish Date - 2021-10-18T06:25:53+05:30 IST
నేను ఇప్పుడు ఒకటి చెబుతున్నా. నాకు నిజాయతీగా రావాల్సిన 380 ఓట్లు మీరు తీసుకున్నారు. 280 ఓట్లు వచ్చాయి. నేను బ్యాలెట్ పేపర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా. ప్లయిట్స్, టికెట్లు బుక్ చేయలేదు. యాక్టివ్ మెంబర్స్‌తోనే మాట్లాడుతూ కూర్చున్నా..
పాత్ర ఏదైనా ఆకళింపు చేసుకోవడంలో అతనో మోనార్క్. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన ప్రకాశ్‌రాజ్ ఇటీవల ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ‘అసలు ఆట ఇప్పుడే మొదలైంద’ని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి గల కారణాలు, భవిష్యత్తు ఆలోచనలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్ పంచుకున్నారు. ఆ సంభాషణలు మీకోసం...
నేను ఇప్పుడు ఒకటి చెబుతున్నా. నాకు నిజాయతీగా రావాల్సిన 380 ఓట్లు మీరు తీసుకున్నారు. 280 ఓట్లు వచ్చాయి. నేను బ్యాలెట్ పేపర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా. ప్లయిట్స్, టికెట్లు బుక్ చేయలేదు. యాక్టివ్ మెంబర్స్‌తోనే మాట్లాడుతూ కూర్చున్నా. నేను ఎవరినీ బెదిరించలేదు. చిన్న వాళ్ల ఇంటికి చీర తీసుకెళ్లలేదు. స్వీట్ ప్యాకెట్లు పెట్టలేదు. నాకు వచ్చిన 280 ఓట్లు జెన్యూన్.
1981లో వచ్చా. నన్ను పరాయివాడన్నారు. 900 మందిలో 150 మంది ఇన్‌యాక్టివ్ మెంబర్లు ఉన్నారు. ఇక్కడ ప్రేమతో రాలేదు. డబ్బులు కట్టించుకుని మెంబర్లు చేశారు. వాళ్లు పెళ్ళిళ్లు చేసుకుని వెళ్లిపోయారు. వాళ్లకు ఈ భాష కూడా రాదు. జెనీలియా లాంటి వాళ్లని ఫ్లయిట్ వేసుకుని తీసుకొచ్చారు. వాళ్లకు కృష్ణానగర్ సమస్యలు తెలుసా? వాళ్లు సడెన్‌గా అనుకుని వచ్చారా. అది పోల్ మేనేజ్‌మెంట్. గెలుపు, ఓటమిని ఇలా అర్థం చేసుకోవాలిప్పుడు. నువ్వు సంపాదించిన ఓట్లతో గెలుపు వేరు. గుద్దించుకుని సంపాదించిన ఓట్లతో గెలుపొందడం వేరు. వదిలేద్దాం! లెట్ అజ్ స్టాక్ అబౌట్.
ఆర్కే: వెల్‌కం టు ఓపెన్‌హార్ట్. నమస్కారం ప్రకాశ్‌రాజ్ గారూ..
ప్రకాశ్‌రాజ్: నమస్కారం సర్
ఆర్కే: చల్లబడ్డారా?
ప్రకాశ్‌రాజ్: నేను ఎప్పుడూ వేడిగా ఉంటాను సర్.
ఆర్కే: పరాభవ భారం నుంచి..
ప్రకాశ్‌రాజ్: పరాభవం అనేది ఎలా చూడాలి సర్? ఓడిపోవడం, గెలవడం అనేది సహజం. జీవితంలో గమ్యం ముఖ్యమైనపుడు లక్ష్యం కనపడకూడదు.
ఆర్కే: మీ గమ్యమేమిటి?
ప్రకాశ్‌రాజ్: ఒక దిగంతానికి వచ్చాను. మరో దిగంతం కనపడుతోంది. (నవ్వులు)
ఆర్కే: ‘మా’నుంచి ఎన్ని ‘మా’లు రాబోతున్నాయి?
ప్రకాశ్‌రాజ్: మారిన ‘మా’రావాలి. మార్పు నిరంతరమెప్పుడూ. మారకపోతే ఇంకో ‘మా’ వస్తుంది.
ఆర్కే: అంటే ఎవరు మారాలి?
ప్రకాశ్‌రాజ్: మనుషులు మారాలి. ఆలోచనలు, అవసరాలు మారాలి.
ఆర్కే: చీలికలు, పీలికల్లేకుండా ‘మా’ బాగా కొనసాగాలంటే ప్రధానంగా ఎవరిలో మార్పు రావాలి?
ప్రకాశ్‌రాజ్: చీలికలు, పీలికలు అంటే ఏంటంటారు?
ఆర్కే: నాగబాబు పీలికలు అన్నారు కదా..
ప్రకాశ్‌రాజ్: అంటే కుటుంబం అన్నారు. భిన్నాభిప్రాయాలున్నాయి. భిన్నాభిప్రాయాలొస్తే చీలికలు అంటారు. ఇట్స్ రాంగ్.
ఆర్కే: భిన్నాభిప్రాయాలు, చీలికలు వేరు కదా..
ప్రకాశ్‌రాజ్: వీళ్లు అలానే అంటారు. కుటుంబం అంటారు. ఎలా కుటుంబం అవుతుంది.
ఆర్కే: అదంతా హిపోక్రసీ!
ప్రకాశ్‌రాజ్: అదంతా అబద్ధం అంటున్నాను. మనమంతా ఒకే కుటుంబం. అది నాన్సెన్స్. ఒకే కుటుంబం అయితే ఎందుకు సొసైటీ యాక్ట్‌కు వెళ్తారు? ఎందుకు ప్రజాస్వామ్యం తీసుకొస్తారు? ఎన్నికలు తీసుకొస్తారు?
ఆర్కే: కుటుంబ పెద్ద ఏమి చెబితే అది వినాల!
ప్రకాశ్‌రాజ్: ఇన్ని సంవత్సరాలు ఏమైంది. కుటుంబం, కుటుంబం.. అనేవాళ్లతో కేర్‌ఫుల్‌గా ఉండాలి మీరు. నిలుచుండే వాళ్ల మధ్య పోటీ ఉండదు. వెనకాల ఎవరున్నారో వాళ్లే ఉండాలి. వెనకుండేవాళ్లు వదలరు. వేరు వేరు రూపంలో వస్తుంటారు. అలా అనేక యుద్ధాలు వస్తుంటాయి.
ఆర్కే: ఆ యుద్ధాల్లో మీరు పావు అయిపోయారు కదా...
ప్రకాశ్‌రాజ్: అలా అనుకుంటున్నారు. కాదంటున్నాను కదా! అనుమానాల్లేవు. నేను పావు కాదు. అది డిస్టర్బింగ్ ఫ్యాక్టర్. అన్ని పెద్దరికాల్ని ప్రశ్నిస్తున్నాను కదా. ఎటెళ్లినా వీడు డేంజరేనని...
ఆర్కే: అందరినీ ప్రశ్నించినప్పుడు ఫలితం ఇలానే ఉంటుంది కదా...
ప్రకాశ్‌రాజ్: ఫలితం ఎలా వచ్చిందని మీరు ఆలోచించాలి.
ఆర్కే: మీ వెనకాల ఎవరూ లేరా?
ప్రకాశ్‌రాజ్: ఎవరో ఒకరు నచ్చితే. వాడు వెనకున్నట్లా?
ఆర్కే: నాగబాబు అన్నారు. ‘మా తరఫున ప్రకాశ్‌రాజ్‌ను పెట్టాలనుకుంటున్నాం. మీ కొడుకును విత్‌డ్రా చేయించు’ అని మోహన్‌బాబుకి చిరంజీవి ఫోన్ చేశారట కదా..
ప్రకాశ్‌రాజ్: విష్ణుగారు చెప్పారు.
ఆర్కే: కాదు. నాకు మోహన్‌బాబు పర్సనల్‌గా చెప్పారు.
ప్రకాశ్‌రాజ్: నిజం కావచ్చు.. అబద్ధం కూడా కావచ్చు కదా.
ఆర్కే: అది ఎవరూ ఖండించలేదు కదా..
ప్రకాశ్‌రాజ్: చెప్పి ఉంటే చెప్పాను అనాలి. ఎందుకు ముసుగులో అంతా!