బెనర్జీని మోహన్‌బాబు కొట్టడానికి వెళ్లినా.. ఇంకో పిల్లవాడిని బూతులు తిడుతున్నా ఎలక్షన్ ఆఫీసర్ మాట్లాడలేదు..
ABN , First Publish Date - 2021-10-18T06:30:29+05:30 IST
కేటీఆర్‌గారు వచ్చే సీఎం. నా నంబర్ ఉంది. ఆయన నాకు మెసేజ్ చేస్తాడు. అయినంత మాత్రాన నన్ను సపోర్టు చేస్తాడా. ఆయన లెక్కలు ఆయనకుంటాయి. బేసిక్‌గా వీళ్లంతా..
కేసీఆర్ మీకు పరోక్షంగా సహకరించలేదా...
ఆయనకు వేరే పనిలేదా? ఆయన్ని రెండుసార్లు కలిశా. నేనంటే అభిమానం. ఒకరోజంతా కలిసి మాట్లాడుకున్నాం. గౌరీలంకేష్.. ఇలా అన్నీ మాట్లాడినప్పుడు అభినందించారు. కేటీఆర్‌గారు వచ్చే సీఎం. నా నంబర్ ఉంది. ఆయన నాకు మెసేజ్ చేస్తాడు. అయినంత మాత్రాన నన్ను సపోర్టు చేస్తాడా. ఆయన లెక్కలు ఆయనకుంటాయి. బేసిక్‌గా వీళ్లంతా సెల్ఫీగ్రూపులు. ఏం మాట్లాడాడో.. ఎందుకొచ్చాడని తిట్టారో.. నాకు తెలీదు. అందరికీ ఇలా ఉండాలని చెబుతా అని.. నన్ను ‘బొమ్మరిల్లు ఫాదర్’ అంటారు అని కేసీఆర్ అని నాతో జోక్ చేశారు. అలాగని నాకు ఆయన చాలా క్లోజ్ అనుకుంటే నా మెచ్యూరిటీకి సిగ్గేకదా.
ఆర్కే: ఫస్ట్ ఎవరి దగ్గరకు వెళ్లారు?
ప్రకాశ్‌రాజ్: నేను ఎవరి దగ్గరకు వెళ్లలేదు. మా మెంబర్స్‌తో మాట్లాడా. లాస్ట్ టైం నరేష్ నిలబడినప్పుడే నిలుచుందాం అనుకున్నా. మనముండే ఇండస్ర్టీనే రచ్చరచ్చగా ఉంటే ఓ బాధ్యత అనేది ఉంటుంది కదండీ.
ఆర్కే: అవకాశాలు కల్పించడంలోనా.. ఆధిపత్యంలోనా..
ప్రకాశ్‌రాజ్: అవకాశాలు కల్పించలేరు. ఇగో.. నేను అధికారంలో ఉండాలని తప్పితే. యు ఆర్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అంటే కుటుంబం అంటారు. దాదాపు యాభైశాతం ఓటింగ్‌కి రారు. మరి ఎలా కుటుంబం అవుతుంది. సరే.. ఆదుకోవాలి. ఎవరు ఎవరిని ఆదుకోవాలి. ఎవడికి వాడు కష్టపడి ప్రొఫెషన్‌లో పైకి వచ్చిన తర్వాత ముట్టుకోరు ఇంకొకరిని.
ఆర్కే: అసలు సమస్యే అది..
ప్రకాశ్‌రాజ్: ఎంతమంది అరవై ఏళ్లు దాటినవాళ్లున్నారు. అసలు మీ దగ్గర డేటా లేదు. మొన్న ఈ ఎలక్షన్‌లో ట్రావెల్ అవుతుంటే ఓ పెద్దాయనకు ఫోన్ చేశా. తన భార్య చనిపోతే.. పిల్లలు ఓల్డేజ్ హోమ్‌లో ఉంచారని చెప్పారు. ఇది తెలియదు వీళ్లకు. పెన్షన్ ఓ ముప్ఫయి మందికి ఇస్తున్నారు. కానీ చాలామంది ఉన్నారు. ఇవ్వడానికి డబ్బుల్లేవు. ఓ అసోషియేషన్‌గా సస్టయినబిలిటీ లేదు. ఆదాయమార్గాలు లేవు.
ఆర్కే: మా అసోషియేషన్‌లో డబ్బు ఉందా?
ప్రకాశ్‌రాజ్: ఎక్కడుంది సార్. నాలుగైదు కోట్లు డబ్బా? ఏమి చేస్తారు అది పెట్టుకుని. అరవై ఏళ్లు దాటినవాళ్లు దాదాపు 15 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నారు. వారు 100మంది ఉంటే.. వాళ్లకు పెన్షన్ ఇవ్వాలంటే సంవత్సరానికి కోటి ఇరవై లక్షలు కావాలి. ఎక్కడుంది? పొలిటీషియన్లలా 5 వేలను 6వేలు చేయడం. ఎకనామిక్ స్ర్టాటజీ లేదు.. దీస్ ఆర్ ఆల్ నాన్సెస్.
ఆర్కే: ప్రాంతీయవాదం తీసుకొచ్చారు కదా. అయితే మీరు 2018 ఎలక్షన్‌లో కేసీఆర్ గెలిచాక చంద్రబాబుకి ఏం పని? అని మీరు నోరు జారారు.
ప్రకాశ్‌రాజ్: మీకు అదే వినిపించింది. ఆయనమీద గౌరవం లేదని కాదు. స్టాండ్ సిచ్యువేషన్స్. ఒక మహామైత్రి కూటమి చేసుకున్నారు కదా. 30 మంది సీఎంలు ఉన్నారు కదా. మీకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇది ఓన్లీ విష్. క్యాండిడేట్స్ ఆల్సో కొందరికి మాటలు కూడా రావు. ఆ సిచ్యువేషన్‌లో క్వొశ్చన్‌లో.. ‘మీకేం పని’ అని అన్నా.
ఆర్కే: వాళ్లకి ఇక్కడ సీట్లు ఉన్నాయి. ఆయనకేం పని అన్నారు మీరు.. క్యాజువల్‌గా అన్నారా?
ప్రకాశ్‌రాజ్: ఇండిపెండెంట్‌గా నిలుచున్నవారిలా అయిపోయారన్నా. మీ స్థాయికి అలా అవ్వకూడదు అని.
ఆర్కే: ‘మా’ సభ్యత్వానికి రిజైన్ చేశారు కదా.
ప్రకాశ్‌రాజ్: అడిగేది అడుగుతానండీ. ప్రతి నెల ఆదివారం రిపోర్టు కార్డు అడుగుతా. ఐ విల్ ఆస్క్ ఎ రిపోర్ట్.
ఆర్కే: మెంబర్ కాకపోతే ఎలా చేస్తారు.
ప్రకాశ్‌రాజ్: నేను ఇక్కడ ఉండి యూపీలో ఆదిత్యనాథ్‌ను ప్రశ్నిస్తా. చైనీస్ ప్రెసిడెంట్‌ను అడుగుతా. డొనాల్డ్ ట్రంప్‌ను అడుగుతా. నేను మనిషిని. విశ్వమానవుడిని అవుతాన్నేను. అది హ్యూమన్ స్పిరిట్. స్పందించే గుణం ఉండాలి. మెంబర్ అయితేనే స్పందించాలి అంటే ఎలా? అక్కడ ఉండి క్వశ్చన్ చేస్తే నన్ను బ్యాన్ చేస్తారు. ఇదే కదా మీ అలవాట్లు. ఇంకో 500 మందిని తెస్తారు. బైలాస్ మారిపోతుంది మీది. ఆ తర్వాత ఎన్నికలే వద్దంటారు. పర్మినెంట్ డీ ఆర్సీ పెట్టుకుంటారు మీరు. గెలిచింది నువ్వు.. మాట్లాడింది మీనాన్న. బెనర్జీని మోహన్‌బాబు కొడుతుంటే ఎలక్షన్ ఆఫీసర్ మాట్లాడకుండా చూస్తున్నారు. ఇంకో పిల్లవాడిని బూతులు తిడితే ఏమీ అనలేదు. ఎవడైనా ఫ్లయిట్ దిగి వస్తే మా పేపర్ తీసి వాళ్ల పేపరు చేతికిస్తే మురళీ మోహన్‌గారు చూస్తూ ఉన్నారు. ఇదేనా పెద్దరికం?
ఆర్కే: కృష్ణమోహన్ 10 ఎలక్షన్లు కండక్ట్ చేశాడు
ప్రకాశ్‌రాజ్: ఇంకేం చేస్తాడు. మోహన్‌బాబు, నరేష్‌కి మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌కు లాయరు. ఏమైనా చేస్తారు.
ఆర్కే: బెనర్జీని కొట్టారా?
ప్రకాశ్‌రాజ్: కొట్టడానికి వెళ్లాడు. బూతులు తిట్టాడు. ఆయన ఏజ్ పెద్దది కదా.. పాపం.
ఆర్కే: మీ ప్యానల్ మెంబర్ హేమ కొరికిందట కదా..
ప్రకాశ్‌రాజ్: దిస్ ఈజ్ వాట్.
ఆర్కే: మీ స్థాయి ఆర్టిస్టులకు షేమ్ అనిపించలేదా..
ప్రకాశ్‌రాజ్: అసహ్యంగా ఉంది. అందుకే కదా వచ్చా. నీ రూమ్ క్లీన్‌గా ఉంటే సరిపోతుందా? చూస్తున్నవాళ్లకు వీధి కనిపిస్తోంది. ముందు స్లమ్ ఉంది కదా. అందరికీ బాధ్యత ఉంది. పెద్దహీరోలు బాధ్యత తీసుకోరు. ఖండించరా? పెద్దలుగా ఉండాలనుకుంటారు. దేన్ని పట్టించుకోకపోతే మంచోళ్లు అంటే ఎలా? ఎవరి బాధ్యత వారికి ఉంది.
ఆర్కే: మోహన్‌బాబుకి పాదాభివందనం చేశారెందుకు?
ప్రకాశ్‌రాజ్: పెద్దోళ్లు.. కూల్‌డౌన్ అన్నా. ముఖం మీద చెప్పాను. ఎందుకు రెండేళ్లు తక్కువగా అనిపిస్తున్నది మీకు. అవసరమా ఈ మాటలు అన్నా. ‘సారీ ప్రకాశ్.. బిహేవ్ యువర్ సెల్ఫ్ ప్లీజ్’ అని చెప్పారు.
ఆర్కే: ఓ పక్క పాదాభివందనం.. ఇంకో పక్క ఏంటి ఇది?
ప్రకాశ్‌రాజ్: ఆయన సీనియర్ ఆర్టిస్టు. మోస్ట్ హ్యూమరస్ ఫెలో. ఆయన్ని డిస్టర్బ్ చేయకపోతే.. ఆయనంత మంచోడు లేడు. ఆయనను డిస్టర్బ్ చేస్తే పది మంది వెనకాల ఉంటే కొట్టడానికి వస్తాడు. ఆయన ఒక్కడే ఉంటే అలానే ఉంటాడు. ఇలా భయపడితే ఎలా ఉంటుంది అసోసియేషన్.
ఆర్కే: మోహన్‌బాబు రెచ్చగొడితే రెచ్చిపోతాడు అన్నారు కదా మీరు. ఇంకో వాదన ఉంది. అతని నోరు అదుపులో ఉండదనేది అందరి మాట.
ప్రకాశ్‌రాజ్: ఈ పెద్దవాళ్లతో సమస్య ఏంటంటే.. ‘ఒన్‌వే అది మైవే’ అంటారు. దీనివల్ల హూ ఆర్ ది సఫరర్స్.
ఆర్కే: ఆయన 15 రోజుల నుంచి నోరు అదుపులో పెట్టుకున్నారు. వారి క్యాంపులోంచి వచ్చిన ప్రొవొకేషన్స్‌తో మీరు నోరు జారారని చెప్పను. టెంపర్ లూజ్ అయ్యారు. సేమ్ టైం నాగబాబు నోరు పారేసుకున్నారు. మీరు కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఫర్ ప్రెసిడెంట్ పోస్టు.
ప్రకాశ్‌రాజ్: వక్రీకరించి చెప్పినది మీరు చెప్పకూడదు. పెద్దరికం అంటే ఏంటీ అన్నా. ఒక చెట్టు ఉదాహరణ ఇచ్చా. పెద్దోళ్లు పెద్దరికం వద్దంటే భయం వద్దు. వక్రీకరించారు.
ఎందుకు ఏడ్వను.. బాధ ఉంటుంది.. నేను రాయి కాదు కదా.. ఇంటికెళ్లి పడుకున్నపుడు..(part 3)