రిస్క్‌ తీసుకోవడం నాకిష్టం

ABN , First Publish Date - 2021-11-15T05:30:00+05:30 IST

జయలలిత సంప్రదాయానికి స్టాలిన్‌ అడ్డుకట్ట వేశారు.

రిస్క్‌ తీసుకోవడం నాకిష్టం

విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారాయన. రంగమేదైనా రిస్క్‌ తీసుకోవడం ఆయనకిష్టం. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయనే రాధికా శరత్‌కుమార్‌. ఇంకా సినిమాపై ఉన్న ప్యాషన్‌ పోలేదంటున్న శరత్‌కుమార్‌ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే కార్యక్రమంలో మాట్లాడారు. అందులోని కొన్ని సంభాషణలు ఇవి...


ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ సోషల్‌ సర్వీస్‌ ఈజ్‌ పాలిటిక్స్‌ అని నా అభిప్రాయం. శరత్‌ కుమార్‌ హీరో అయ్యాడు కాబట్టి పాలిటిక్స్‌లోకి అడుగు పెట్టలేదు. నిజానికి నేను స్కూల్లో ఉన్న రోజుల నుంచే సర్వీస్‌ చేసేవాడిని. ఆ తత్వం నాకు ముందు నుంచీ ఉంది. ఎంతో మందికి నేను ఉచిత సేవ చేశాను. లేదంటే ఎన్నో ఆస్తులు కొనుక్కుని ఉండేవాడిని. 


మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్‌ సెల్వన్‌ అనే సినిమాలో నటిస్తున్నాను. అదొక చారిత్రక నేపఽథ్యం ఉన్న సినిమా. ఏప్రిల్‌లో పార్ట్‌-1 రిలీజ్‌ అవుతుంది. జగపతి బాబుతో కలిసి తెలుగులో ఒక వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను. దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని చోట్లా అభిమానులున్నారు. నేను హెల్త్‌ ఐకాన్‌గా గుర్తింపు పొందాను. ఇంత వయసులో కూడా 25 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తానని అంటూ ఉంటారు. 


ఆర్కే: వెల్‌కమ్‌ టు ఓపెన్‌ హార్ట్‌! నమస్కారం... శరత్‌ కుమార్‌ గారు...

శరత్‌కుమార్‌ : నమస్కారమండీ!


ఆర్కే:  ఎలా ఉన్నారు?

శరత్‌: బాగున్నాను!


ఆర్కే: అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ బాడీని అలాగే మెయింటెయిన్‌ చేస్తూనే ఉన్నారనుకుంటా!

శరత్‌: దటీజ్‌ మై ఇన్వె్‌స్టమెంట్‌. 


ఆర్కే: సో... దాని వల్ల వేషాలొచ్చాయా?

శరత్‌: 100% దానివల్లే వచ్చాయి. మొదట్లో బాడీ బిల్డర్‌గా ఉన్నప్పుడు విలన్‌గా ఇంట్రడ్యూస్‌ చేశారు. హీరో కొట్టే దెబ్బలకు ఈయనైతే గట్టిగా ఉంటారు అని.


 ఆర్కే: బాడీ మీద అంత ఆసక్తి ఏర్పడింది?

శరత్‌: మై ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌... మై ఫాదర్‌. ఆయన కాలేజీలో, యూనివర్శిటీలో స్పోర్ట్స్‌మెన్‌, బాక్సర్‌. మోస్ట్‌ ఇంపార్టెంట్‌ థింగ్‌ ఈజ్‌ టేకింగ్‌ కేరాఫ్‌ యువర్‌ హెల్త్‌ అని చెప్పారు. అది ఇప్పటివరకూ అనుసరిస్తున్నాను. 


 ఆర్కే: బాడీ బిల్డర్‌ అంటే ఫుడ్‌ దగ్గర్నుంచి జాగ్రత్తలు తీసుకోవాలా? ప్రొటీన్‌ పౌడర్లు లాంటివి తీసుకోవాలా?

శరత్‌: అప్పట్లో అలాంటివేవీ లేవు సార్‌! ఐయామ్‌ నాట్‌ 25 ఇయర్‌ ఓల్డ్‌. ఇప్పుడు నాకు 67 ఏళ్లు. బాగా తిని, బాగా వ్యాయామం చేయడమే ఉండేది. అలాగే అతి ఏదైనా చెడు చేస్తుంది కాబట్టి అన్నీ కంట్రోల్‌లో ఉండాలి అని చెప్పేవారు. లక్ష్మణ రేఖ గీసుకుని, దాన్లో ఉండమనేవారు. ఇప్పటికీ నేను దాన్నే అనుసరిస్తున్నాను. 


 ఆర్కే:  మీ జీవితం ఎలా మొదలైంది?

శరత్‌: పుట్టింది ఢిల్లీలో. అక్కడి ఆల్‌ ఇండియా రేడియోలో నాన్న తమిళ న్యూస్‌ రీడర్‌గా పని చేసేవారు. నాన్నకి చెన్నై ట్రాన్స్‌ఫర్‌ అయ్యాక అక్కడి కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నాను. న్యూ కాలేజీలో బిఎస్సీ మ్యాథమ్యాటిక్స్‌ చేశాను. అప్పట్లో బెంగళూరులో పేపర్‌ బాయ్‌గా కూడా పనిచేశాను. దినకరన్‌ తమిళ పేపర్‌కు రిపోర్టింగ్‌ పని చేశాను. సర్క్యులేషన్‌, స్పేస్‌ సెల్లింగ్‌ పనులు చేశాను. చెన్నై వచ్చిన తర్వాత ట్రావెల్‌ ఏజెన్సీ పెట్టాను. అక్కడ లిరిసిస్ట్‌ కన్నదాసన్‌ కొడుకు టిక్కెట్‌ కోసం నా దగ్గరకు వచ్చారు. ఆయనతో సినిమాలో నటించాలని ఉందని చెప్పాను. ఆయన నన్నే ప్రొడ్యూస్‌ చేయమన్నారు. 


 ఆర్కే: మరి డబ్బులు?

శరత్‌: బెంగళూరులో దాచుకుంది 20 లక్షలు చేతిలో ఉంది. అలా మూవీ చేశాం. తర్వాత విజయకాంత్‌ సార్‌ను కలిశాను. ఆయన ఇచ్చిన అవకాశంతో మొదట విలన్‌గా తర్వాత హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను.  


ఆర్కే: ఇండస్ట్రీలో ప్రాబ్లెమ్స్‌ ఎదుర్కొన్నారా?

శరత్‌: ఎన్నో ఎదుర్కొన్నాను. ఇప్పటి యువత ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు కదా? ఆ లెక్కన నేనీపాటికి వెయ్యి సార్లు ఆత్మహత్య చేసుకుని ఉండాలని వాళ్లకు చెబుతూ ఉంటాను. ఒకసారి హైదరాబాద్‌లో  షూటింగ్‌లో పడిపోయి వెన్ను జాయింట్లు విరగ్గొట్టుకున్నాను. 


 ఆర్కే: మీకూ చిరంజీవికీ సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది?

శరత్‌: ఆయనతో కలిసి గ్యాంగ్‌ లీడర్‌లో నటించాను. తర్వాతి సినిమాలో కూడా ఉన్నాను. చాలా సినిమాల్లో నటించాలని ఉంది అని ఆయనతో అన్నాను. అందుకాయన ‘‘నువ్వు హీరో అయిపోతావ్‌!’’ అన్నారు. ఆయన అన్నట్టే హీరో అయిపోయాను. అయితే తర్వాత కొంతకాలానికి ఆర్థికంగా ఇబ్బందులొచ్చాయి. దాంతో ఆయనను కలవడానికి చెన్నై నుంచి వచ్చాను. నా కోసం ఆయన తన షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారు. ఒక ప్రొడ్యూసర్‌ చిరంజీవి డేట్లు దొరికితే నన్ను సపోర్ట్‌ చేస్తానని అన్నారు. అదే విషయం చిరంజీవి గారితో చెప్పి, ఎంత శాలరీ తీసుకుంటారు అని అడిగాను. ‘నువ్వు సమస్యల్లో ఉండి, నాకు శాలరీ ఇస్తావా? ముందు సినిమా చేద్దాం! లాభంలో 50ు ప్రొడ్యూసర్‌ మీకే ఇస్తారు కదా? దాన్లో చూద్దాంలే!’’ అన్నారు. ఆ తర్వాత ఆయన అన్నట్టే నేను హీరో అయిపోయాను. అలా అప్పటి నుంచి ఇప్పటివరకూ ఓ బ్రదర్‌లా ఆయనతో అనుబంధం కొనసాగిస్తున్నాను. 


 ఆర్కే: ఆ సినిమా బాగా సక్సెస్‌ అయిందా?

శరత్‌: ఆ సినిమా కంటే ముందే నేను హీరో అయిపోవడంతో, ఆ సినిమా చేసే వీలు కుదర్లేదు. 


 ఆర్కే: మీ కెరీర్‌ గ్రాఫ్‌ చూస్తే అన్నీ ఎగుడుదిగుళ్లే కనిపిస్తాయి. ఈ రిస్క్‌ అవసరమా?

శరత్‌: రిస్క్‌ తీసుకోవడం నాకిష్టం. రిస్క్‌, ఒత్తిడి లేకుండా నా జీవితం ముందుకు సాగదు. స్ట్రెస్‌ లేకపోతే జీవితంలో థ్రిల్‌ ఉండదు. ఒత్తిడి అలవాటైపోయింది. అది లేకపోతే బోర్‌ కొడుతుంది.


ఆర్కే: తెలుగు నటులతో పోలిస్తే, తమిళ నటులు వేషాలపరంగా ప్రయోగాల్లో ముందుంటారు కదా!

శరత్‌: సబ్జెక్ట్‌ బాగుంటే ముందుకు వెళ్లిపోతాం. కాంచన చేసేటప్పుడు లారెన్స్‌ను అడిగాను. ఇంత పెద్ద బాడీతో ట్రాన్స్‌జెండర్‌లా నటిస్తే, ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకుంటారా అని అడిగాను. కానీ లారెన్స్‌ నన్ను కన్విన్స్‌  చేశాడు. అది పెద్ద హిట్‌ అయింది.

 

 ఆర్కే: ఇలా భిన్నమైన ప్రయోగాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం కొంత కష్టం...

శరత్‌: ఇమేజ్‌ను బ్రేక్‌ చేసి ఒకటి రెండు సినిమాలు చేస్తే, ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ ఇక్కడ ఆడియన్స్‌ హీరోలను ఒకేలా చూడడానికి అలవాటు పడిపోయారు. కాబట్టే ఇక్కడి హీరోలు ఇమేజ్‌ను కాపాడుకుంటూ దాన్లోనే వైవిద్యం ప్రదర్శిస్తూ ఉంటారు.


 ఆర్కే: తమిళనాడులో హీరోగా పేరు తెచ్చుకున్న ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఆ పాపులారిటీని అటు డైవర్ట్‌ చేసుకుందామని అనుకుంటూ ఉంటారా?

శరత్‌: ఎంట్రీ ఇన్‌టు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఈజ్‌ ఎ గ్రీన్‌ కార్డ్‌ టు పాలిటిక్స్‌ అని ఎవరైనా అంటే నేను ఖండిస్తాను. 

 

జయలలిత సంప్రదాయానికి స్టాలిన్‌ అడ్డుకట్ట వేశారు.

(PART 1)

Updated Date - 2021-11-15T05:30:00+05:30 IST