పేస్‌ పొలిటికల్‌ ఎంట్రీ

ABN , First Publish Date - 2021-10-30T08:15:59+05:30 IST

భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాడు.

పేస్‌ పొలిటికల్‌ ఎంట్రీ

తృణమూల్‌ పార్టీలో చేరిన టెన్నిస్‌ దిగ్గజం

పనాజీ: భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 48 ఏళ్ల పేస్‌ బుధవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీలో చేరాడు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో నటి, మాజీ మిస్‌ ఇండియా సఫీసా అలీతో పాటు పేస్‌ ఆ  పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. టెన్నిస్‌ నుంచి రిటైరయ్యాక దేశ ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనుకున్నాననీ, అందుకే రాజకీయాల్లో చేరానని పేస్‌ వ్యాఖ్యానించాడు. 

Updated Date - 2021-10-30T08:15:59+05:30 IST