15 ఓవర్లకు పంజాబ్ స్కోరు ఎంతంటే..

ABN , First Publish Date - 2021-05-03T02:22:38+05:30 IST

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 10ఓవర్లలో 102 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్..

15 ఓవర్లకు పంజాబ్ స్కోరు ఎంతంటే..

అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 10ఓవర్లలో 102 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(47 నాటౌట్: 36 బంతుల్లో.. 3 ఫోర్లు, 1 సిక్స్‌లు) అర్థ సెంచరీ చేసి ఊపుమీదున్నాడు. అయితే మిగతావారంతా అంతంతమాత్రగా రాణించడంతో జట్టు ఇప్పటికే కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది.  ప్రభ్‌సిమ్రన్ సింగ్(12) మరోసారి నిరాశపరచగా, క్రిస్ గేల్(13) ఈ సారి భారీ స్కోరు చేయలేకపోయాడు. ఇక డేవిడ్ మలాన్(26) అంతంత మాత్రంగా స్కోరు చేయగా.. దీపక్ హుడా(1) సింగిల్ డిజిట్‌కే పరిమితమైపోయాడు. ప్రస్తుతం క్రీజులో మయాంక్‌తో పాటు షారూక్ ఖాన్(2) ఉన్నాడు.  

Updated Date - 2021-05-03T02:22:38+05:30 IST