రాణించిన బట్లర్, శాంసన్.. ముంబై టార్గెట్ ఎంతంటే..
ABN , First Publish Date - 2021-04-29T22:56:49+05:30 IST
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో తొలి మ్యాచ్ ఈ రోజు జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకోవండంతో రాజస్థాన్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు..
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో తొలి మ్యాచ్ ఈ రోజు జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకోవండంతో రాజస్థాన్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు జోస్ బట్లర్(41: 32 బంతుల్లో.. 3ఫోర్లు, 3 సిక్స్‌లు), యశశ్వి జైస్వాల్(32: 20 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడడంతో పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 47 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా అదే దూకుడుతో ఇద్దరూ ఆడారు. అయితే 8వ ఓవర్లో రాహుల్ చాహర్ బౌలింగ్‌లో బట్లర్ అవుటయ్యాడు. అంతకుముందు బంతిని సిక్స్ కొట్టిన బట్లర్.. ఆ తరువాతి బంతిని కూడా అదే తరహాలో ముందుకొచ్చి సిక్స్ కొట్టబోయి మిస్ అయ్యాడు. బంతి అందుకున్న కీపర్ డీకాక్ వికెట్లను గిరాటేశాడు.
10వ ఓవర్లో జైస్వాల్ కూడా అవుట్ కావడతో స్కోరు బోర్డు నెమ్మదించింది. అయితే మరో వికెట్ పడకుండా కాపాడుకుంటూనే కెప్టెన్ సంజు శాంసన్(42: 27 బంతుల్లో.. 5 ఫోర్లు) ధాటిగా ఆడాడు. ఆ తరువాతి ఓవర్లోనే శివమ్ దూబే(35:31 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అవుట్ అయ్యాడు. ఇక చివర్లో రియాన్ పరాగ్ (8), డేవిడ్ మిల్లర్(7) క్రీజులో ఉన్నీరు. దీంతో రాజస్థాన్ 4 వికెట్లకు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. ఇక ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ 2 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్, బుమ్రాలకు చెరో వికెట్ దక్కింది.