బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్
ABN , First Publish Date - 2021-02-07T00:47:28+05:30 IST
బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అప్‌డేట్ చేసినట్లు సంస్థ తెలిపింది. రూ. 199 ప్లాన్‌తో అపరిమిత వాయిస్ ఫోన్ కాల్స్ చేసుకొవచ్చని సంస్థ తెలిపింది.
ఈ కొత్త ప్లాన్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉంటుందని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పేర్కొంది. రూ. 199 బీఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 25 జీబీ నెలవారీ డేటా కూడా ఉంటుంది.75జీబీ వరకు డేటా రోల్‌ఓవర్ సౌకర్యం ఉంటుందని తెలిపింది.