ఈసీకి తప్పుడు నివేదిక: మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-09-05T02:18:38+05:30 IST
హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదా కోసం ఈసీకి
హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదా కోసం ఈసీకి తెలంగాణ ప్రభుత్వం తప్పుడు నివేదిక పంపిందని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోతోందని కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందన్నారు. తప్పడు నివేదికల ద్వారా తెలంగాణ ప్రభుత్వం హుజురాబాద్ ఉపఎన్నికను వాయిదా వేయించిందని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
అనుకున్నట్లుగానే హుజురాబాద్ ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు సీఈసీ ఓ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఉపఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. అయితే మళ్లీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీగా తెలియరాలేదు. కాగా.. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చింది.