రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన
ABN , First Publish Date - 2021-01-29T04:32:05+05:30 IST
రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
మహబూబాబాద్ రూరల్, జనవరి 28: త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న అవినీతి, అరాచక, ఫ్యామిలీ పార్టీకి బుద్ధి చెప్పాలని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబాబాద్ బీజేపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ ఇన్‌చార్జ్‌లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి రూ.3016 ఇస్తానని చెప్పి రెండెళ్లు గడిచినప్పటికి సీఎం కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఉద్యోగులకు 45 శాతం పీఆర్సీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రె్‌సకు, టీఆర్‌ఎ్‌సకు ఓట్లు వేస్తే ఒరిగేదేమి లేదని బీజేపీ ఓటు వేస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జాటోత్ హుస్సెన్‌నాయక్, యెండల లక్ష్మీనారాయణ, వి.రాజవర్ధన్‌రెడ్డి, వద్దిరాజు రాంచందర్‌రావు, యాప సీతయ్య, ఎడ్ల అశోక్‌రెడ్డి, రాచకొండ కొమురయ్య, వల్లభు వెంకటేశ్వర్లు, శశివర్ధన్‌రెడ్డి, చెల్పూరి వెంకన్న, మహేష్, రాఘవులు, పెద్దగాని సోమయ్య, మురళీ, నవీన్‌కుమార్, శ్యాంసుందర్‌శర్మపాల్గొన్నారు.
కేసముద్రం : దుబ్బాక, హైదరాబాద్‌లలో బీజేపీ విజయంతోనే ప్రజలకు దూరం అవుతున్నామనే భయంతోనే టీఆర్‌ఎస్ తన ఎన్నికల ఎజెండాను అమలు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు.
కేసముద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే తన సొంత యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాడని, గెలిచాక ఐదేళ్లకాలంలో మళ్లీ ఇప్పుడు ఓట్ల కోసం కనిపిస్తున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్‌నాయక్, రాష్ట్ర నాయకుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లభు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు పొదిల నర్సింహారెడ్డి, వోలం శ్రీనివాస్, ధరావత్ శోభన్, ఏదునూరి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.