కేంద్ర పధకాల అమలుతీరు పై కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ సెక్రటరీ ప్రశంస
ABN , First Publish Date - 2021-03-06T22:01:08+05:30 IST
ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్ పథకాలను విజయవంతంగా అమలు
హైదరాబాద్: ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ సెక్రటరి దుర్గా శంకర్ మిశ్రా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. అమృత్ , స్మార్ట్ సిటీ మిషన్ , స్వచ్ఛ భారత్ మిషన్, పీఎం స్వనిధి, హౌసింగ్ ఫర్ ఆల్ లాంటి పథకాల పురోగతి పై కేంద్ర కార్యదర్శి బీఆర్ కేఆర్ భవన్ లో నేడు సమీక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అమలులో సాధించిన పురోగతిని కూడా గుర్తించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న అర్బన్ స్కీమ్స్ పై సీనియర్ మున్సిపల్ అధికారులు డిటేల్డ్ ప్రజెంటేషన్ చేశారు. సమావేశం అనంతరం కేంద్ర కార్యదర్శి లక్డికాపుల్ నుండి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించడంతో పాటు, ఫతుల్లాగూడలోని జంతు సంరక్షణ కేంద్రం, వనస్థలిపురంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను సందర్శించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,రహదారులు, భవనాల మరియు హౌసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, కేంద్ర జాయింట్ సెక్రటరి సంజయ్ , హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండి దాన కిషోర్, జీహెచ్ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్ ,అదనపు కమీషనర్, యుసిడి, శంకరయ్య, హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎన్.వి.ఎస్ రెడ్డి, మున్సిపల్ పరిపాలన కమీషనర్ అండ్ డైరెక్టర్ సత్యనారాయణ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ పమేలా సత్పతి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ వల్లురి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.