కరోనా మహమ్మారిపై పోరుకు.. వైద్యవిధానాలను ఏకీకృతం చేయాలి

ABN , First Publish Date - 2021-11-29T08:54:51+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరు కోసం ఆయుర్వేదం, హోమియో, ప్రకృతి వైద్యం, యునానీ వంటి చికిత్సా విధానాలను ఏకీకృతం చేసి మెరుగైన వైద్యవిధానాన్ని

కరోనా మహమ్మారిపై పోరుకు.. వైద్యవిధానాలను ఏకీకృతం చేయాలి

‘బ్రాంకస్‌ 2021’ సదస్సులో చినజీయర్‌ స్వామి


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిపై పోరు కోసం ఆయుర్వేదం, హోమియో, ప్రకృతి వైద్యం, యునానీ వంటి చికిత్సా విధానాలను ఏకీకృతం చేసి మెరుగైన వైద్యవిధానాన్ని అందుబాటులోకి తేవాలని త్రిదండి చినజీయర్‌ స్వామి వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలకు సూచించా రు. కొవిడ్‌ మూడోదశ వాప్తి జరుగుతున్న ఈ సమయంలో అల్లోపతి మందులకు దీటుగా వచ్చిన ఆనందయ్య ఆయుర్వేద మందుపైనా మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరముందన్నారు. యశోద ఆస్పత్రుల ఆధ్వర్యంలో నోవాటెల్‌లో నిర్వహించిన రెండు రోజుల పల్మనాలజీ సదస్సు ‘బ్రాంకస్‌ 2021’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘సకలజీవ కోటిలో ప్రకృతిని నాశనం చేస్తున్నది మనిషి మాత్రమేనని.. మనిషి అత్యాశ కారణంగానే ప్రకృతి నాశనం అవుతోంది’’ అని చినజీయర్‌ స్వామి అన్నారు. బ్రాంకియాల్‌ థర్మోప్లాస్టీ విధానంలో దేశంలో ఎక్కువమంది రోగులకు చికిత్స చేసిన ఘనత తమ సొంతమని యశోద గ్రూప్‌ ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ జిఎస్‌ రావు తెలిపారు.


ఈవిధానంలో గరిష్ఠస్థాయిలో సంతృప్తికర ఫలితాలు వచ్చాయన్నారు. ప్రసిద్ధ పల్మనాలజిస్టులతో ఈ సదస్సు ఏర్పాటు ద్వారా నూతన చికి త్సా పద్ధతులపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించగలిగా మని యశోద ఆస్పత్రుల డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన వైద్యుడు మిశ్రా మా ట్లాడుతూ.. కరోనా సోకి మధ్యప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్న తనను ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారని, ఇక్కడి వైద్యుల వల్లే తన ప్రాణాలు నిలిచాయన్నారు.

Updated Date - 2021-11-29T08:54:51+05:30 IST