మహబూబాబాద్ జిల్లాలో గణతంత్ర వేడుకల్లో ఘర్షణ
ABN , First Publish Date - 2021-01-26T16:17:48+05:30 IST
72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ రాజుకుంది.
మహబూబాబాద్: 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ రాజుకుంది. ఈ సంఘటన జిల్లాలోని బయ్యారం మండలంలో జరిగింది. జాతీయ జెండా ఆవిష్కరణలో ఈ వివాదం తలెత్తింది. కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు పోటాపోటీగా జెండా వందనం చేసేందుకు ముందుకు వచ్చారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చి వారిని సముదాయించారు. దాంతో వివాదం సద్దుమణిగింది.