సీవీ ఆనంద్, జితేందర్ అదనపు డీజీపీలుగా ఎంప్యానెల్
ABN , First Publish Date - 2021-08-21T07:34:20+05:30 IST
తెలంగాణ కేడర్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, జితేందర్‌లను అదనపు డీజీపీలుగా కేంద్రం ఎంప్యానెల్ చేసింది. ప్రస్తుతం వారిద్దరూ అదనపు డీజీపీ హోదాలోనే ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ డిప్యూటేషన్‌పై సీఐఎ్‌సఎ్‌ఫలో, 1992 బ్యాచ్ జితేందర్ తెలంగాణ శాంతి భద్రతల అదనపు డీజీపీగా విధులు నిర్వహి....
హైదరాబాద్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కేడర్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, జితేందర్‌లను అదనపు డీజీపీలుగా కేంద్రం ఎంప్యానెల్ చేసింది. ప్రస్తుతం వారిద్దరూ అదనపు డీజీపీ హోదాలోనే ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ డిప్యూటేషన్‌పై సీఐఎ్‌సఎ్‌ఫలో, 1992 బ్యాచ్ జితేందర్ తెలంగాణ శాంతి భద్రతల అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి నళిని ప్రభాత్‌ను కూడా అదనపు డీజీపీగా కేంద్రం ఎంప్యానెల్ చేసింది. అదనపు డీజీపీల ఎంప్యానెల్ జాబితాలో దేశవ్యాప్తంగా మొత్తం 14 మంది ఉన్నారు. అందులో 1991 బ్యాచ్ ముగ్గురు, 1992 బ్యాచ్ 11 మంది ఉన్నారు. 1992వ బ్యాచ్‌లో 80 మంది ఐపీఎస్ అధికారులుండగా, కేంద్రం కేవలం 11 మందినే అదనపు డీజీపీలుగా ఎంప్యానెల్ చేయడం గమనార్హం.