అర్హులైన దివ్యాంగులందరికీ లబ్ధి

ABN , First Publish Date - 2021-03-28T04:48:02+05:30 IST

అర్హులైన దివ్యాంగులందరికీ లబ్ధి

అర్హులైన దివ్యాంగులందరికీ లబ్ధి
పాలకుర్తిలో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు

- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు  

పాలకుర్తి, మార్చి 27 : అర్హులైన దివ్యాంగులందరికీ ప్రభుత్వం లబ్ధి చేకూరేలా అన్ని చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. శనివారం జనగామ జిల్లా పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘రాష్ట్ర దివ్యాంగుల సంస్థ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరాన్ని దివ్యాంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్‌ వాసుదేవరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ.3,016 వేలు పెన్షన్‌ను ప్రతినెలకు రూ.150 కోట్లు ఏడాదికి రూ. 1800 కోట్లు ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్రంలో దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఆలీమ్‌కో సంస్థ నిపుణుల సహకారంతో శారీరక దివ్యాంగులకు అవసరమయ్యే బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్‌, కాలిపర్స్‌. కృత్రిమ కాళ్లు అందచేయడానికి వీలుగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 

రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం అని అన్నారు. వికలాంగుల సంస్థ ద్వారా త్వరలో రూ.20 కోట్లతో 13 వేలమంది దివ్యాంగులకు లబ్ధి చేకూరే విధంగా లాప్‌ట్యా్‌పలు, బదిరుకలు 4జీ, స్మార్ట్‌ఫోన్‌ వివిధ రకాలైన అనేక ఉపకరణలను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జడ్పీ కోఅప్షన్‌ సభ్యుడు మదార్‌, వీరమనేని యాకాంతరావు, నవీన్‌, దయాకర్‌, వికలాంగుల సంఘం నాయకులు చిట్యాల సంధ్యారాణి తదితరులున్నారు. 

Updated Date - 2021-03-28T04:48:02+05:30 IST