బీడీ కార్మికుల ధర్నా
ABN , First Publish Date - 2021-03-06T20:17:00+05:30 IST
ప్రభుత్వాలు చేపడుతున్న కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా జిల్లాలోని
కామారెడ్డి: ప్రభుత్వాలు చేపడుతున్న కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా జిల్లాలోని బీడీ కార్మికులు పట్టణంలో ధర్నా చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఏఐఎఫ్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు దాదాపు నాలుగు వేలకు పైగా బీడీ కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలపై బీడీ కార్మికులు నిరసన తెలిపారు.