వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాలను పాటించాలి

ABN , First Publish Date - 2021-01-12T04:16:36+05:30 IST

వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాలను పాటించాలి

వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాలను పాటించాలి
మార్గదర్శకాలపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను తిలకిస్తున్న అధికారులు

అధికారులకు డీఎంహెచ్‌వే ఆదేశం

వరంగల్‌రూరల్‌ కల్చరల్‌, జనవరి 11: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాలు పాటించాలని, ప్రతీ కేంద్రంలో ఐదుగురు వ్యాక్సినేషన్‌ ఆఫీసర్లు ఉండాలని డీఎంహెచ్‌వో చల్లా మధుసూదన్‌ ఆదేశించారు. సోమవారం డీఎంహె చ్‌వో కార్యాలయంలో వ్యాక్సినేషన్‌ ఆపరేషన్‌ గైడ్‌లైన్స్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ కేంద్రంలో 100మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటగా హెల్త్‌లైన్‌, వర్కర్స్‌, అంగన్‌వాడీ టీచర్స్‌, వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. 16న కమ్యూని టీ హెల్త్‌ సెంటర్లు నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, ఆత్మకూరు పీహెచ్‌సీ కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ఇస్తారన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్లు ప్రకాష్‌, గోపాల్‌రావు, కమ్యూనిటీ హెల్త్‌ సూపరింటెండెంట్లు డాక్టర్లు గోపాల్‌, నర్సింహస్వామి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు అశ్వినికుమార్‌, విపిన్‌కుమార్‌, రాజు, విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-12T04:16:36+05:30 IST